ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మందుపై స్పష్టత కావాలి

ABN, First Publish Date - 2020-06-26T08:18:29+05:30

కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్న దశలో యాంటి వైరల్ పేరుతో రెండురకాల మందులకు డిసిజిఐ అనుమతిచ్చినట్టు వార్తలు వచ్చాయి. అవి ఖరీదయినవి. ఒకటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్న దశలో యాంటి వైరల్ పేరుతో రెండురకాల మందులకు డిసిజిఐ అనుమతిచ్చినట్టు వార్తలు వచ్చాయి. అవి ఖరీదయినవి. ఒకటి వైరస్‌ ప్రాధమిక దశలో ఉన్నప్పుడూ, మరొకటి క్లిష్టంగా మారిన దశలో అని చెబుతున్నారు. ఈ మందుల గురించి ప్రభుత్వం అధికారికంగా సూచనలేమీ చేయలేదు. వైరస్ బాధితులకు ప్రభుత్వం  అందిస్తున్న చికిత్సలో వీటిని వాడుతున్నారా లేదా అనేదీ తెలియదు. ఇప్పుడు వైరస్ చికిత్సకు ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలకు అనుమతిస్తున్న నేపథ్యంలో, ఈ మందులకు అనుమతి దక్కడం సందేహాలకు తావిస్తున్నది. ప్రైవేట్‌, కార్పొరేట్ వైద్యులు వీటిని వాడమని బాధిత రోగులకు సూచిస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. నష్టపోతారు అనేకంటే దోచుకోబడతారనడం సబబుగా వుంటుంది. కనుక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. నిర్దిష్టంగా ఉపయోగపడని మందుల కారణంగా బాధిత రోగులు నష్టపోకుండా చూడాలి. వైరస్‌కు కచ్చితమైన మందు, లేదా వాక్సిన్ వచ్చేవరకూ సామాన్య ప్రజలందరికీ ప్రభుత్వమే చికిత్స అందించాలి. ఇక దేశీయంగా పతంజలి ఆయుర్వేద కంపెనీ విడుదల చేసిన మందుపై కూడా స్పష్టతనివ్వాలి. ఈ మందుని వైద్యులెవ్వరూ రోగులకు అంటగట్టే పరిస్థితి లేదని విమర్శకులు గమనించాలి. ఆంగ్ల మందుల కంపెనీలపై, చైనా దురాక్రమణపై విమర్శించడానికి పెగలని నోళ్ళు  పతంజలిపై విషం చిమ్ముతూ, విమర్శలకు దిగడం ద్వారా తమ హిందూ - జాతీయవాద వ్యతిరేక వికృతత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. 

వీరుభొట్ల పేరయ్యశాస్త్రి

విజయవాడ

Updated Date - 2020-06-26T08:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising