ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికలేవి?

ABN, First Publish Date - 2020-10-31T05:57:59+05:30

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సరైన ప్రణాళికలను అమలు చేయడం లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సరైన ప్రణాళికలను అమలు చేయడం లేదు. అప్పుడప్పుడు జారీ చేస్తున్న ఉద్యోగ నియామక ప్రకటనలు కూడా ఏవో లోపాల కారణంగా కోర్టు పరిధిలో మాలుగుతున్నాయి. తక్కువ సంఖ్యలో ఉన్న ఖాళీలకు వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి చదువులు పూర్తి చేసుకున్న వారిని  ఏదో విధంగానైనా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు తగినన్ని లేకపోతే ప్రైవే టురంగాల్లో నైనా ఉద్యోగ


భద్రత కల్పించాలి. బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి వ్యాపార రంగంలో శిక్షణ ఇప్పించాలి. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల పెంపకం, కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలవంటివి ఏర్పాటు చేసుకో వడానికి అవకాశాలు కల్పిస్తే కొంతమేరకైనా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ప్రభు త్వం ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది. చదువుకున్న వారందరూ మంచి భవిష్యత్తు కోసం వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమతూ కూర్చున్నారు. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న యువతకు పనిని కల్పించినప్పుడే దేశం ప్రగతిని సాధిస్తుంది. వీరి భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సమాజం తీవ్ర పరిమాణాలకు ఎదుర్కోవల్సి వస్తుంది.

నరేష్‌ జాటోత్‌

Updated Date - 2020-10-31T05:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising