ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాద బ్రహ్మ

ABN, First Publish Date - 2020-12-11T05:55:28+05:30

మానవులను దగ్గరికి తీయడంలో సాహిత్యం కంటె కూడా అమోఘమైనట్టిది సంగీతం. దాని రసాస్వాదనకు భాషా జ్ఞానంతో పని లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన సాహిత్యవేత్తలను, సంగీత విద్వాంసులను, శిల్పులను, చిత్రకారులను గౌరవించుకోవడంలో మనం కొంత విజ్ఞతను ప్రదర్శించాలి. అది కొరవడిన గౌరవం నిజమైన గౌరవం కాలేదు; అది అగౌరవమైనా కావచ్చు.


మానవులను దగ్గరికి తీయడంలో సాహిత్యం కంటె కూడా అమోఘమైనట్టిది సంగీతం. దాని రసాస్వాదనకు భాషా జ్ఞానంతో పని లేదు. సంగీతం వివిధ భాషల వారిని, విభిన్న సంస్కృతుల వారిని ఎంత దగ్గరికి తీసుకురాగలదో ఇతర వాగ్గేయకారుల వలె శ్రీత్యాగరాజు కూడా నిరూపించాడు. ఆయన తన కీర్తనలను రచించింది తెలుగులో అయినా, తెలుగువారికంటె మిన్నగా తమిళులు ఆయన పట్ల ప్రేమాభిమానాలను చూపుతున్నారు. భక్తి గౌరవాలను ప్రదర్శిస్తున్నారు. ఇదివరలో కాకపోయినా, కొంతకాలంగా భారతదేశం మొత్తం మీదనే ఆయన పట్ల శ్రద్ధాసక్తులు ప్రస్ఫుట మౌతున్నాయి. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య జాతులవారు భారతదేశానికి చెందిన హిందుస్థానీ, కర్ణాటక సంగీత రీతులలోని మాధుర్యాన్ని గ్రహించగలుగుతున్నారు. కాబట్టి మరికొంతకాలానికి బాక్ వలె, మోజార్ట్ వలె, బిథోవెన్ వలె, హాండెల్ వలె, షొపాన్ వలె, త్యాగరాజు కూడా ప్రపంచ వాగ్గేయకారుడుగా ఖ్యాతి గాంచవచ్చు. నూరేళ్ళనాడు త్యాగరాజు శతజయంతి జరిగిందో లేదో మనకు స్పష్టంగా తెలియదు. కాని, ప్రస్తుతం ఆయన ద్విశతజయంతి ఆయన జన్మ స్థానంలోనే కాక దేశం మొత్తం మీదనే ఘనంగా జరుగుతున్నది. మరొక నూరేళ్ళనాడు ఆయన త్రిశత జయంతి దేశ దేశాలలో జరుగుతుందని విశ్వసించవచ్చు. పోను పోను త్యాగరాజు కీర్తి పెరగగలదని విశ్వసించడానికి ఆయనది రాజకీయ రంగంలో సముపార్జించుకొన్న విఖ్యాతి కాదు. త్యాగరాజు జీవిత చరిత్రను ఇంగ్లీషులో వ్రాస్తూ ప్రొఫెసర్ సాంబమూర్తి త్యాగరాజు మహిమలను గురించిన అనేక కట్టుకథలను అనవసరంగా దానిలో చేర్చడం వల్ల త్యాగరాజు కీర్తిని ఆయన పెంచినట్టు చెప్పలేము. ఆ గ్రంథాన్ని చదివే విదేశీయులు దానిలోని కట్టుకథల వలె గానకళలో త్యాగరాజు ప్రజ్ఞా ప్రాభవాలు సయితం కల్లబొల్లులని అనుకొనగల ప్రమాదంవున్నది. మన సాహిత్యవేత్తలను, సంగీత విద్వాంసులను, శిల్పులను, చిత్రకారులను గౌరవించుకొనడంలో మనం కొంత విజ్ఞతను ప్రదర్శించాలి. అది కొరవడిన గౌరవం నిజమైన గౌరవం కాలేదు; అది అగౌరవమైనా కావచ్చు.

1967 మే 4 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘శ్రీ త్యాగరాజు’ నుంచి

Updated Date - 2020-12-11T05:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising