ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముల్తాని మట్టిప్యాకులు

ABN, First Publish Date - 2020-10-12T06:26:37+05:30

మెలకువ.. గా ఎముకలగూళ్ళని సుట్టుకున్న ఆకలి కొండచిలువగా పలకరిస్తది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెలకువ.. 

గా ఎముకలగూళ్ళని సుట్టుకున్న

ఆకలి కొండచిలువగా పలకరిస్తది


అప్పటికే నల్లరేగడి గోతుల్ని

తవ్వుకున్న కండ్లు, కొనూపిరి

దీపాన్ని బతిమలాడుతుంటయి


చిత్తుకాయితమ్ముక్కలై

మనిషితనం ఎంకులాటలో

ఈదుల్ని ఏరుకుంటుంటయి

పసి కాయాలు


జీవకేంద్ర చౌరస్తా బిల్లాకుబల్లాపై

సొచ్ఛెతాపాఠమై, జీవదీపం సమురు నింపి,


గా దినానికి ఈపు-డొక్కల పెయికాల్‌ సోపతిని 

ఎట్టకేలకు ఇడగొడుతుంది మాసికల చొక్కా


ఎవర్నని ఏం లాభం!

ఏలికా బెమ్మదేవులు రాసిచ్చిన

దినచర్య గిది


నగరి నిత్తెముత్తైదువుగా 

సక్కదనం సెదపురుగులంటూ

తన కూడలిఅద్దంలో గొణుక్కుని

సొచ్ఛె భారత మచ్చలని కసురుకునే

రేపటి ముల్తాని మట్టిప్యాకులివి

కృష్ణ గుగులోత్‌

96180 96173 


Updated Date - 2020-10-12T06:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising