ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్తాఫలం

ABN, First Publish Date - 2020-07-31T07:23:37+05:30

కోమలమైన ఒక పూవు. స్వచ్ఛమైన ఒక పూవు. సౌరభాలను వెదజల్లే ఒక పూవు నేడు ఆకస్మికంగా నేలకు రాలిపోయింది. పూవులంటే ఆయనకు పట్టరాని మక్కువ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను ‘రాజర్షి’ అనేవారు. తిరిగి ఆ పేరుకు తగిన మహామహుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్. ‍‍మతభేదాతీతమైన భారతీయ సంస్కృతి ముక్తాఫలం డాక్టర్ హుస్సేన్. ప్రాచ్య, మధ్య ప్రాచ్య, పాశ్చాత్య సభ్యతల నిగ్గు డాక్టర్ హుస్సేన్. ప్రాచీన, ఆధునిక ప్రపంచాల మధ్య స్వర్ణసేతువు డాక్టర్ హుస్సేన్.


కోమలమైన ఒక పూవు. స్వచ్ఛమైన ఒక పూవు. సౌరభాలను వెదజల్లే ఒక పూవు నేడు ఆకస్మికంగా నేలకు రాలిపోయింది. పూవులంటే ఆయనకు పట్టరాని మక్కువ కాబట్టే ఆకస్మికంగా తలవని తలంపుగా నేడు కన్నుమూసిన డాక్టర్ జాకీర్ హుస్సేన్‌ను పూవుతో మేము పోల్చడం లేదు. నిజంగానే ఆయన ఒక అపురూపమైన పూవు. ఆయన మనస్సు కంటే ఏ పూవు కోమలంగా ఉండగలదు? ఆయన హృదయం కంటే ఏ పూవు స్వచ్ఛంగా ఉండగలదు? ఆయన సంస్కృతి కంటే ఏ పూవు సౌరభాలను వెదజల్లగలదు? పదకొండు రేకులున్నట్టిది నేడు నేలకు రాలిపోయిన పూవు. విద్య దాని మొదటి రేకు, విజ్ఞానం రెండవ రేకు, సంస్కృతి మూడవ రేకు, సౌజన్యం నాల్గవ రేకు, నిగర్వం ఐదవ రేకు, నమ్రత ఆరవ రేకు, సౌహార్ధం ఏడవరేకు, త్యాగశీలం ఎనిమిదవ రేకు, సేవానురక్తి తొమ్మిదవ రేకు, సమగ్ర దృష్టి పదవరేకు, విశ్వమానవ ప్రేమ చివరిరేకు. ఇట్టి పూవు ఆకస్మికంగా, తలవని తలంపుగా నేడు రాలిపోవడం మన దురదృష్టం. మన దేశం దురదృష్టం. 


మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను ‘రాజర్షి’ అనేవారు. తిరిగి ఆ పేరుకు తగిన మహామహుడు నేడు మనలను విడిచి వెళ్ళిన మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఆయన మూర్తిలో, ఆయన ముఖంలో, ఆయన పలుకులో, ఆయన నడకలో రాజఠీవి ఉండేది. ఆ ఠీవితో పోటీపడుతూ ఒక దివ్యతేజస్సు కూడా ఉండేది. పర్ణ కుటీరంలో ఉన్నా, రాష్ట్రపతి భవనంలో ఉన్నా, ఆయన రాజర్షిగానే జీవించేవారు. స్కూలు మాస్టర్‌గా ఉన్నా, వైస్ ఛాన్సలర్, గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పదవులలో ఉన్నా ఆయన రాజర్షిగానే జీవించే వారు. అట్టి రాజర్షి ఆకస్మికంగా, తలవని తలంపుగా నేడు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం మన దౌర్భాగ్యం, మన దేశం దౌర్భాగ్యం. 


జీవితపు విలువలు నేడు తలకిందులైపోతున్నాయి. సంఘజీవితంలో నీతికీ, నిజాయితీకి అంతకంతకుస్థానం తగ్గిపోతుంది. 


ఏ కూడుకుడిచినా, నాలుగు డబ్బులు మూటగట్టినవాడే ప్రయోజకుడుగా మన్నికకు వస్తున్నాడు. ఏ గడ్డికరిచినా, పదవికి వచ్చిన వాడే ఘనుడుగా చెల్లుతున్నాడు. ఇట్టి విపరీత పరిస్థితులలో కొన్ని స్థిరమైన విలువలకు, కొన్ని శాశ్వతమైన విలువలకు ప్రతీకగా నిలుస్తూ వచ్చిన డాక్టర్ హుస్సేన్ ఆకస్మికంగా, తలవని తలంపుగా నేడు నిర్యాణం చెందడం మనకు తీవ్రాఘాతం, మన దేశానికి తీవ్రాఘాతం. మత భేదాతీతమైన భారతీయ సంస్కృతి ముక్తాఫలం డాక్టర్ హుస్సేన్. ప్రాచ్య, మధ్య ప్రాచ్య, పాశ్చాత్య సభ్యతల నిగ్గు డాక్టర్ హుస్సేన్. ప్రాచీన, ఆధునిక ప్రపంచాల మధ్య స్వర్ణసేతువు డాక్టర్ హుస్సేన్. అట్టి మన మూడవ రాష్ట్రపతి ఆకస్మికంగా, తలవని తలంపుగా నేడు కాలధర్మం చెందడం మనకు తీరని లోటు, మన దేశానికి తీరనిలోటు. 

1969 మే 5 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘రాలిపోయిన పూవు: డాక్టర్ జాకీర్ హుస్సేన్’ నుంచి

Updated Date - 2020-07-31T07:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising