ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్‌ చింత

ABN, First Publish Date - 2020-02-10T10:59:37+05:30

ఈ నగర వీధుల్లో అంతగా ఎందుకు నడిచానో నా కాలి చెమటతో వీధులన్నీ ఎంతగా తడిసాయో ఇప్పుడు వెదికితే కోట్లమంది చెమటతో తడిసి... ఆరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నగర వీధుల్లో 

అంతగా ఎందుకు నడిచానో 

నా కాలి చెమటతో వీధులన్నీ 

ఎంతగా తడిసాయో

 

ఇప్పుడు వెదికితే 

కోట్లమంది చెమటతో 

తడిసి... ఆరి... 

చాకిరేవులా వీధి 


ఆరిపోయిన తేమ మీద 

పేరుకుపోయిన ధూళి దూసర 

అలానే ఎలా ఉంట అక్కడ 

ఎన్నెన్ని రూపాలుగా మారి ఉంటాను 


మారుమూలల్లో 

చీకటి నిండిన గల్లీల్లో 

ఎందుకు నా ఆత్మను తిప్పి 

అలసి అరిగి పోయాను 


అంతగనం 

తెలియని శత్రువునో మిత్రువునో 

వెదుకుతూ 

పోరాడుతూ నగరమంతా 

వెదజల్లుకున్నాను

నను నేను 

మాటగా పోగెయ్యలేని మౌనముగా 


నా కంటే ముందు 

నా తరువాత 

నిర్విరామ 

పాదముద్రల చిత్రాల 

పతానే లేదు ఎక్కడా

శూన్యము నేనెగరేసిన 

రంగుల గాలిపటము 


ఏమి పొందలేని నేను 

ఆ ఖాళీనే పొంది ఉంటాను 


సాధించలేని తనమే 

సాధించిన తనం కావొచ్చు 


ఎత్తిపోయలేనంత ఖాళీలో 

ఈదులాడి 

ఈ ధూళి ఉండలో పొర్లాడి 

నను కన్న పేగుకు దండ వంకీనై ఇంకా


తిరిగి అరిగి 

గుండ్రటి సందల్‌ ముక్క వంకు పీలికైయ్యే

ఉత్థాన పతనాల జాతర వినువీధిలో


ఈ ప్రయాణంలో 

నేను నాకిచ్చుకున్న కానుక 

బహుశా ఈ నిర్‌ చింత నే!

షాజహానా


Updated Date - 2020-02-10T10:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising