ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ఓ కొత్త తవ్వాయి

ABN, First Publish Date - 2020-06-29T10:56:35+05:30

దేశం చిట్టచివరి రాయిపై నిల్చొని దేశపటంపైకి కళ్లు విప్పార్చి చూస్తున్నా మంచుకొండలనుండీ ఈ రాయిదాకా ఆదిమకాలం నుండి ఈనాటిదాకా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశం చిట్టచివరి రాయిపై నిల్చొని

దేశపటంపైకి కళ్లు విప్పార్చి చూస్తున్నా

మంచుకొండలనుండీ ఈ రాయిదాకా

ఆదిమకాలం నుండి ఈనాటిదాకా

ఎంత చరిత్ర నడిచిందో

చరిత్రంటే నడిచొచ్చిన దారులు 

పరుచుకున్న జీవనాలు

చుట్టుకున్న మనుగడలూ పెనవేసుకున్న 

బంధాలు కాదు కదా

చరిత్రంటే పారిన రక్తపుటేరులు

ఆక్రమించుకొన్న భూభాగాలూ

ఎక్కిన సింహాసనాలూ

తెగిపడ్డ తలలు కదా

వర్తమానమూ భిన్నంగాలేదు

ఇప్పటికీ తలమీద ఎక్కుపెట్టిన తుపాకీ

నిరంతరం దేహాలను స్రవిస్తునే ఉంది

ఆ పక్కన

వేసుకొన్న బట్టలమీద చిందుతోన్న నెత్తురు 

తింటున్న తిండిమీద పోస్తున్న నిప్పులు

నిరంతరం ఒకానొక అవమానం నన్ను దహిస్తూనే ఉంది

వివక్ష, విధ్వంసం, నిర్మూలనల మధ్య

ఎప్పుడూ నన్ను నేను నిరూపించుకుంటూనే ఉన్నాను

అన్నీ పెట్టుమచ్చలే తప్ప పుట్టుమచ్చలేని నేను

అవయవాల్ని కోసుకొని

అగ్నిగుండానికి ఆహుతిస్తూనే ఉన్నాను

గోడలకవతలైనా ఇవతలైనా

సమాధులమీదే శ్రద్ధ

నిరంతరం ప్రశ్నల్నే ఎదుర్కొంటున్నవాడ్ని

దోషిగా ముద్రపడున్నవాడిని

కనీసం మాటకోసమైనా నోరు పెగలని వాడ్ని

కలాన్ని కలల్నీ కళ్లనీ కోల్పోతున్నవాడ్ని

మరణపు అంచులకు వేలాడుతున్నవాడ్ని

నువ్వొక దేశంగానూ నేనొక ఒట్టి దేహంగానూ

ప్రతిష్టితమవుతున్నచోట

ఏదో ఒక గుర్తింపుకార్డే నా ఉనికి

బ్రతకడమంటే మాంసం కొడుతూనో

ఇనుపముక్కలకు పట్టీలు వేస్తూనో

మల్లెలమాలలల్లుతూనో

కారుతున్న చెమటల్లోంచి 

పైసలేరుకోవడం అయినచోట

నిన్నూ నన్నూ వేరుచేసేదేమిటి

పుట్టుక నాకు ప్రమేయం లేనిది కదా

బ్రతకటమొక్కటే సాహసమవుతున్నచోట

ఎన్నిసార్లు దుఃఖపడుతూ

మళ్లీ మళ్లీ మొలకెత్తాలో

అవమానాలరేఖల్ని దాటటానికి

ఎన్నిసార్లు నా దేహాన్ని ఒలిచి చూపించాలో

ఎప్పుడూ ఎదో ఒక కొత్త తవ్వాయి

నాకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది

దేశపు ఉపద్రవాల మచ్చలు

ఎప్పుడూ నన్నే అంటిపెట్టుకొని ఉంటాయి

ఎన్ని పుట్టుకల తరువాత

ఈ నేల నన్ను కౌగిలించుకొంటుందో

మట్టికీ ముద్దకీ మధ్య నిలిచిన

రక్తపుటేరులు ఎప్పటికి ఇంకిపోతాయో

బండ్ల మాధవరావు

88976 23332


Updated Date - 2020-06-29T10:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising