ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాజా కళాశాల ప్రైవేటీకరణా?

ABN, First Publish Date - 2020-12-09T06:25:12+05:30

విజయనగరంలో 1879 నుంచి విద్యా వెలుగులు విరజిమ్ముతున్న మహారాజా కళాశాలలో ప్రస్తుతం 4000 మంది విద్యార్థులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరంలో 1879 నుంచి విద్యా వెలుగులు విరజిమ్ముతున్న మహారాజా కళాశాలలో ప్రస్తుతం 4000 మంది విద్యార్థులు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర గల ఈ కళాశాల గత 15 ఏళ్లుగా (2004 నుంచి) ఎయిడెడ్ నిధలు సరగ్గా అందక, రిటైర్మెంట్ అయిన అధ్యాపకుల స్థానంలో రిక్రూట్మెంట్ లేక పార్ట్‌టైమ్‌, గంటల ప్రాతిపదికన బోధించే అధ్యాపకులతో నడుస్తున్నది. ఎమ్‌ఆర్ కాలేజీలో సీటు వస్తే ఉద్యోగం సంపాదించవచ్చు అన్న నమ్మకం విద్యార్థులలో ఉంది. ఈ కళాశాలలో సీటు సంపాదించి ఒక ప్రక్క విద్యను కొనసాగిస్తూ మరో ప్రక్క పోటీ పరీక్షలకు సిద్ధపడి వందలాది మంది ఉత్తరాంధ్ర విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలను ప్రైవేటీకరించడానికి లేదా మూసివేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో విజయనగరం, ఉత్తరాంధ్ర వెనుకబడిన వర్గాలకు ఆశనిపాతముగా మారింది. అందుకే పూర్వ విద్యార్థులు, వామపక్షాలు, కాంగ్రెస్, లోక్‌సత్తా, బిఎస్‌పి, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఇటీవల తెలుగుదేశం, బిజెపి కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. అయినప్పటికీ ప్రభుత్వం, మాన్సాస్ ట్రస్ట్ స్పందించడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామన్న ప్రభుత్వం మహారాజా కళాశాలను ఎందుకు ప్రైవేటీకరించడానికి పూనుకుంటోందో తెలియడం లేదు. రాజకీయ కారణాలతో కాలేజీని ప్రైవేటీకరించడం తగదు. అధ్యాపక పోస్ట్‌లను ఎయిడెడ్ ద్వారా భర్తీ చేసి కాళాశాల పూర్వ ప్రతిష్ఠను కాపాడాలి. లేదా ప్రభుత్వమే ఈ కళాశాలను స్వాధీనం చేసుకోవాలి లేకపోతే ఉత్తరాంధ్ర బడుగు విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుంది. దాని ఫలితాన్ని ప్రభుత్వం కూడా అనుభవించవలసి ఉంటుంది.

బద్రి కూర్మారావు, విజయనగరం

Updated Date - 2020-12-09T06:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising