ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్నా’టకం

ABN, First Publish Date - 2020-05-09T06:31:15+05:30

మానవజాతి ఊహకందని ఉపద్రవం ‘ఆది’కాలపు అతిథి సాక్షాత్కారం సంఘజీవికి తప్పని భౌతికదూరం పట్టువీడని జాతిజనుల సంకల్పం అనుబంధాలే బంధనాలుగా స్వీయ నిర్బంధం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవజాతి ఊహకందని ఉపద్రవం

‘ఆది’కాలపు అతిథి సాక్షాత్కారం

సంఘజీవికి తప్పని భౌతికదూరం

పట్టువీడని జాతిజనుల సంకల్పం

అనుబంధాలే బంధనాలుగా స్వీయ నిర్బంధం

జనులంతా ఒక్కటై సాగించిన సామాజిక యజ్ఞం


జాతినంతటినీ ఏకతాటిపై నిలిపిన అరుదైన ఘట్టం

అడగకుండానే అమలైన సంపూర్ణ మద్యనిషేధం

అధికార పార్టీకదే పెనువిషాదం

జనించే చైతన్యం జ్వలిస్తుందేమోనన్న భయం

మత్తువీడకుండా మధువర్షపు పన్నాగం

సునామిలా ముంచేసిన మధుసంద్రపు కెరటం

నిషేధం మాట నీటి మూటేనని సుస్పష్టం


లాక్‌డౌన్! కరోనాపై మానవాళి ఎక్కపెట్టిన బాణం

మద్యమన్నది మనిషిపై ప్రభుత చేసే యుద్ధం

మత్తువీడి బతకగలనన్న సామాన్యుడి ప్రాణం

మందు అమ్మకుండా మనలేనన్న ప్రభుత్వ వైనం

రాష్ట్రమంతటా మద్యపాన యజ్ఞం

బారుల ముందు బారులు తీరిన మహాజనం

పదండి ముందుకు పదండి తోసుకు అంటూ ప్రభంజనం

పాఠాలు చెప్పే పంతుళ్ల పాలిట అది శాపం

సిగ్గుతో చచ్చిపోయింది వారి ప్రాణం

రాబోవు మహా విపత్తుకది సంకేతం


ఆవిరైన ఆరువారాల ఆకలి పస్తుల కష్టఫలం

కొల్లగొట్టబడిన కోట్ల రూపాయల ప్రజాధనం

ఏ ఇంట చంటిబిడ్డ ఊపిరాగిందో పాలకోసం?

ఏ తల్లి పుస్తెలకిపుడు చెల్లిపోయిందో కాలం?

ఉరిపోసుకున్న తల్లీ బిడ్డకు ఎవరిస్తారు సమాధానం?

ఇక దోపిడీలు దొంగతనాలదే రాజ్యం


చివరి రక్తపుబొట్టును సైతం పీల్చుకుతాగే క్రూరత్వం

అధికారం కోసం ఆడిందే నిషేధమన్న ‘జగన్నా’టకం

జననేత మాటల్లో జనహితం పెద్ద బూటకం

పెదాలకే పరిమితమైన సంక్షేమం

తప్పదు ప్రజలపై ‘రెట్టింపు’ భారం

నిలువుదోపిడీకిది నిలువెత్తు సాక్ష్యం 

నిషేధమన్నది నిరుపేదల వంచించిన కుతంత్రం 

ప్రజల ప్రాణాలను పణం పెట్టిన ప్రభుత తీరు అమానవీయం.. అమానుషం



-ఆకృతి

Updated Date - 2020-05-09T06:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising