ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాషా వికాసం

ABN, First Publish Date - 2020-02-21T07:27:37+05:30

ఏభాష అయినా ప్రజల నిత్య వ్యవహారావసరాలను బట్టే అభివృద్ధి అవుతుంది. ప్రజల అవసరాలలో నుంచి పుట్టిన మాటలే సరియైనవి. వాటికి వేరే ప్రమాణం అక్కరలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏభాష అయినా ప్రజల నిత్య వ్యవహారావసరాలను బట్టే అభివృద్ధి అవుతుంది. ప్రజల అవసరాలలో నుంచి పుట్టిన మాటలే సరియైనవి. వాటికి వేరే ప్రమాణం అక్కరలేదు. వ్యవహారమే వాటికి ప్రమాణం. విశాఖపట్నం హార్బరు నిర్మాణ సమయంలో డ్రెడ్జరును మొదటిసారిగా అక్కడి కూలీలు చూశారట. దానికి వారు ‘తవ్వోడ’ అని పేరు పెట్టారు. అంతకంటే మంచి మాటలను ఏ పండితుడు సృష్టించలేదు. 


ఈ విధంగా ప్రజల వ్యవహారంలో కొత్త మాటలు పుట్టడమే కాదు, ఇతర భాషల నుంచి అవసరార్థం ఎన్నో పదాలు తెలుగులో చేరి తెలుగు అయిపోయాయి. మన దేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు పోర్చుగీసువారు. వారి భాషనుంచి ఎన్నో పదాలు తెలుగులోకి వచ్చాయి. సముద్రపు ఒడ్డుకు ‘కోస్తా’ అనే మాట వారిదే. మనం తాళం చెవి అనే దాని మూలం ‘చావి’ అనే పోర్చుగీసు మాట. ఇక ఇంగ్లీషు నుంచి, ఉర్దూ, పార్సీల నుంచి వచ్చిన మాటలకు లెక్కలేదు. ఇంగ్లీషు నుంచి వచ్చినవేవో మనకు తెలిసినవే. వీటిలో అనేక పదాలు ప్రజల నిత్యవ్యవహారంలోనికి వెళ్ళాయి. అదే విధంగా ఉర్దూ, పార్సీ శబ్దాలనేకం వాడుకలో వున్నాయి. సర్కారు, శిస్తు, కిస్తీ, అర్జీ, మాసూలు, జిల్లా, తాలూకా, ఫిర్కా, మునసబు ఇంకా ఎన్నో. ఆఖరికి రైతు అనే పదం సైతం ఉర్దూ నుంచి వచ్చినదే. ఈ మాటలకు అర్థాలను ఏ రైతుకు చెప్పనక్కర లేదు. 


వీటిని యథాతథంగా ఉపయోగించడం మానివేసి, హిందీలో నుంచి కొత్త మాటలను తీసుకోవడం కంటే తెలివితక్కువ లేదు. హిందీవారు వాడుకలో వున్న వాటిని వదిలిపెట్టి సంస్కృతజన్యమైన పదాలను తీసుకోవడమే వివేకహీనం కాగా, వారిని చూచి మనం వాతలు పెట్టుకోవడం ఇంకా వివేక హీనం కాగలదు

(1969 జూలై 4 ఆంధ్రజ్యోతి సంపాదకీయం ‘తెలుగులో చట్టాలు’ నుంచి)

Updated Date - 2020-02-21T07:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising