ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాడున్నవో బిడ్డా...

ABN, First Publish Date - 2020-05-09T06:17:47+05:30

ఇంట్ల కొయ్యకు యాలడుతున్న నీ పాత అంగీ యాది చేస్తున్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్ల కొయ్యకు 

యాలడుతున్న 

నీ పాత అంగీ

యాది చేస్తున్నది


ఆకిట్ల మూలకు 

పడ్డ శినిగిన 

శెప్పులు నీ కాళ్లను 

సుడాలంటున్నాయి


వంకగ 

పెరుగుతుందని 

కొమ్మలు కొట్టేసిన 

చెట్టు ఉయ్యాల 

కట్టుకొని ఎదురుచూస్తున్నది


పచ్చికారం 

ఏసుకొని తినే గిన్నె 

నీ కోసం మెతుకులు 

కలుపుకొని కూసున్నది


అంబలి 

తాగిన శెమ్బు

గోడ మీద 

పెట్టిన యాపపుల్ల 

మళ్లా ముట్టుతవేమోనని 

చూస్తున్నై


దొడ్ల కట్టేసిన ఎద్దు 

కంట్ల నీళ్లు నింపుకొని

పట్నం దిక్కు చూస్తున్నది


చిన్నప్పుడు నీతో 

గోటిలాట ఆడిన దోస్తులు 

నిన్నడిగి పోతుండ్రు


ఎంత దూరం 

నడిసినవో గాని 

జరంత జల్ది రా బిడ్డా


నడిసి నడిసి

పగిలిపోయిన నీ కాళ్లకు 

మలాం పెట్టాలె



– ఖాజ అఫ్రిదీ

Updated Date - 2020-05-09T06:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising