ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళన్న యాదిలో..

ABN, First Publish Date - 2020-09-09T06:46:29+05:30

‘కా’ కాలాన్ని ‘ళో’ లోకాన్ని ‘జీ’ జీవితాన్నీ వడబోసిన కవిత్వశాల. ప్రజల భాషలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కా’ కాలాన్ని 

‘ళో’ లోకాన్ని

‘జీ’ జీవితాన్నీ

వడబోసిన కవిత్వశాల.


ప్రజల భాషలో...

హక్కులనడిగిన ప్రజల మనిషి.

ప్రజా హృదయాలతో

అక్షరోద్యమం నడిపిన ప్రజాకవి..


మనలో ఒకడిగా- మనతో ఒకడిగా ఉంటూ

మన కోసం పోరాడిన కవి హృదయం.


జీవితపు దారులలో..

సాహిత్యపు గొడవలలో..

ఎవరికీ తలవంచని- 

ప్రజావాది నువ్వే! ప్రజావాణి నువ్వే..!!


రాజులను ప్రశ్నించిన కలం

రాజ్యాలను ఎదిరించిన గళం..


పాలకుల పాపాల్ని -

ప్రజాస్వామ్య లోపాల్ని ఎండగడుతూ..

ఒక్కడైతేనేమి తిరగబడాలంటూ

ఉద్యమానికి ఊపిరి పోసిన

కలంయోధుడు..


ప్రజలు, పౌరహక్కులు

ప్రాథమిక స్వేచ్ఛలు కవితా వస్తువులై..

అన్యాయాన్ని ఎదిరించినవాడే

ఆరాధ్యుడయ్యాడు.


పాలకులు ఎవరైనా..

దోచేవారికి -దాచేవారికి నీవంటే భయం.

ప్రాంతాలు ఏవైనా...

పేద ప్రజలకు నలు దిశలకు

నీవుంటే అభయం..


బడి పలుకుల భాష కాదు

పలుకుబడుల భాష కావాలంటూ

సాహిత్యం సమాజంలోని సామాన్యుని ప్రతిధ్వనయ్యాడు..


సాగిపో.. సాగిపో ఆగిపోరాదు..

సాగిపోవుటే బ్రతుకు.. ఆగిపోవుటే చావు

పుట్టుక నీది చావు నీది- 

బ్రతుకంతా దేశానిది..

అంటూ..


కాలం.. నాళికపై నిలబడ్డ

నిన్నటి స్వప్నం- రేపటి జ్ఞాపకం ‘నేను’ ప్రస్తుతం అన్న..

ప్రజల బంధువు.. పద్మ విభూషణుడు..


కాలగర్భంలో

వందేళ్ళ క్రితం పుట్టిన మా కవి మహాకవి 

వెయ్యేళ్ళకు సరిపడా సాహిత్య సమాలోచనలు.. 


మీ యాదిలో.. మీ స్ఫూర్తితో..

రేపటి ఉద్యమమై.. ఓ ‘కాళన్నా’

మీ సిరా చుక్కలై లక్ష మెదళ్లను కదిలిస్తాం!!

పొట్లూరి హరికృష్ణ

పూర్వ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమీ

(నేడు కాళోజీ జయంతి)

Updated Date - 2020-09-09T06:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising