ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కడజాతి యిండ్లల్ల కండ్లు తెరువద్దు బిడ్డా!

ABN, First Publish Date - 2020-10-14T07:17:35+05:30

బిడ్డా మనీషా! మా ‘ఆవారా’ యిండ్లల్ల అంటరాని జాతుల్ల తప్పిపోయి గూడ పుట్టకుండ్రి బిడ్డా! గీ కడ జాతోల్లకు కన్న పేగైనందుకే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిడ్డా మనీషా! 

మా ‘ఆవారా’ యిండ్లల్ల

అంటరాని జాతుల్ల

తప్పిపోయి గూడ పుట్టకుండ్రి బిడ్డా!

గీ కడ జాతోల్లకు కన్న పేగైనందుకే

వూరి మదాలు,

నీ తనువును యిచ్చుకపోయిన యిస్తారి జేసినా

కుల్లబొడిసిన కల్లం జేసి కాడు జేసినా

కడసూపు పొడనన్నా కండ్లగానని కడుపుకోత

ఆగం జేసింది అబద్ధమట

నాలికె కోసి నడుములిరిసి

‍సంపుకున్నది మేమే నట

అధికారాలన్నీ నిందితులకే నీడ బడ్తయి

గందికే గీ గులాపోల్ల గూడెమ్‌ల పుట్టకుండ్రి బిడ్డా!

బద్రతలు బరోసాలున్న 

ఏ పెద్ద కులాలల్ల పుట్టినా...

మీకు గింత కత్తికోతల గత్తర చావులుండయి

బట్టకు, పొట్టకు, సదువు, సంపద

మానం మర్యాదల గౌరవాలకు గ్యారెంటి వుంటది

బైటోనితో సెటాన సెంపబడది

కన్నెత్తి చూస్తే, కంచికచెర్ల కోటేశులే..


మనీషా! నువ్వు నిర్భయ, దిశ లాగ

ఇండియన్‌ డాటర్స్‌ అయినా

ఆ దశ, ఆ యిలువ వేరేగుంటది

వాల్లకు ఆగమేగాల మీద అంతర్జాతీయ

ఆసుపత్రి చికిత్సలు

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులేంది

పాలక, ప్రతిపక్షాలన్ని పరామరికలే

దాపున దండాలు, దండలు.

లోక్‌సభ లొల్లులు, రాజ్యసభ రచ్చలు

అసెంబ్లీలన్ని ఆరగోలు బారగోల్లు

మిడియా మిన్నిక్కి 24x7గా

సంచలన కోతల కోడికూతలు

మహిళా సంగాల ధర్నాలు దద్దరిల్తయి

ప్రభుత్వాలు ప్రతిపక్షాల గుండెలు గొంతులు

ఒకే రాగమై శివాలూగే పీఠాలు...

సత్వర న్యాయాలు, కఠిన శిక్షలు

నిందితుల్ని నిర్మూలిస్తయి

గియన్నీ, నీ నోటికందయి, నొసటికి చెందయి

గందికే మా కడజాతి యిండ్లల్ల

కండ్లు తెరువకుండ్రి బిడ్డా!


– జూపాక సుభద్ర

Updated Date - 2020-10-14T07:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising