ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులోని గుర్రాలు

ABN, First Publish Date - 2020-07-27T05:55:46+05:30

వస్తాయి అవి వాకిట్లోకి నిదురలోనో నీడగానో నిను వెంటాడి నిరంతరంగా బాకీల పడి చస్తావు ఈ నేలకు ఎవరికి రుణపడి వున్నావో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వస్తాయి అవి వాకిట్లోకి నిదురలోనో నీడగానో

నిను వెంటాడి నిరంతరంగా

బాకీల పడి చస్తావు ఈ నేలకు

ఎవరికి రుణపడి వున్నావో

ఎక్కడ మిత్తి మిగిలిపోయిందో

ఎప్పటికీ తెలియకుండా వెళ్ళిపోతావు

వాయిదాలకు తలవంచి ఎల్లిన కాడికి చెల్లించి

ఒక్కోసారి అప్పు కాయిదం

నీ బతుక్కు ఇడుపుగాయిదమవుతుంది


నూరేండ్ల పంట నడుమంతరంగానే

చీడల బారిన పడుతుంది

మంచె మీద నిదుర కాచి కాపాడుకుంటావు కంటిపాపలను

కార్తెలో వేయాల్సిన పంట వేయక

తీయాల్సిన కలుపుదీయక వెనుకబడిపోతావు

నిన్నటి పంట రుణం తీర్చుమని

ఒక తరుణం దారుణమైపోతుంది

నీ పాదాలకు గుచ్చిన

తుమ్మ ముండ్ల నెత్తుటి మరకలు ఆరుద్ర పురుగులు

ఏ దారిలోనూ ఎన్నడూ గెలవని

ఓడే పందెం గుర్రానివి

నిన్ను నువ్వోడి ఒక బంగారి పురుగువై

ఏ కంచెలోనో మోదుగు చెట్టు మీద వాలి 

         మాయమవుతావు


తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు బంధువులు

నీ చుట్టూ వున్న మనుషులు ఇంతింతై అంతకంతకు పెరిగి

నీ వెంట పరుగెత్తే అప్పులోని గుర్రాలు


చావును తిని చావును తాగి చావును పీల్చి

                                 నిలబడుతుంది బతుకు

కౌగిలించుకోవాలని వుంటుంది

మృత్యువును, ప్రియురాలును, పసిపాపను

కానీ చేయలేవు ఏం చేయలేవు


ఇన్ని నిందలేస్తంగానీ

మృత్యువుకెపుడైనా ముఖముండి చచ్చిందా?

కాలమెప్పుడైనా అప్పును బొందలో పూడ్చిందా?

తైదల అంజయ్య

98668 62983


Updated Date - 2020-07-27T05:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising