ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టర్లపై ప్రేమ కర్షకులపై ఏదీ?

ABN, First Publish Date - 2020-04-11T06:22:20+05:30

రాష్ట్రంలో వ్యవసాయరంగం కోలుకోలేని నష్టాల్లోకి, సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ ఏడాది పంటలు బాగానే పండాయి. కానీ, పంటని ఇంటికి చేర్చుకొని, అమ్ముకునే దారి లేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో వ్యవసాయరంగం కోలుకోలేని నష్టాల్లోకి, సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ ఏడాది పంటలు బాగానే పండాయి. కానీ, పంటని ఇంటికి చేర్చుకొని, అమ్ముకునే దారి లేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? లాక్‌డౌన్‌కు తోడు అకాల వర్షాలు రైతాంగాన్ని మరింత దెబ్బతీసాయి. వర్షాల వల్ల కోతకొచ్చిన వరి పైరు నేల పాలైంది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటమునిగింది. కోతకోయాల్సిన మిర్చి పొలంలోనే రాలిపోయింది. ఉడికించిన పసుపు తడిచిపోయింది. పక్వానికి వచ్చిన నిమ్మ, అరటి, తోటలు నేలకొరిగాయి. మామిడి, దానిమ్మ, బొప్పాయి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. లాక్‌డౌన్ మూలంగా ఆదాయం పడిపోయిందని చెప్పి రైతులను ఆదుకునే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేయడం మంచిది కాదు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.8000 కోట్ల బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఇలాగే పుట్టెడు కష్టాల్లో వున్న ఆన్నదాతను కూడా ఆదుకోవాలి.


లాక్‌డౌన్‌తో చేతికొచ్చిన రబీపంటలు నోటి కందకుండా పోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉద్యాన పంటలు కూరగాయలు, పండ్ల రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దేశ ఉత్పత్తిలో 15.5 శాతం పండ్లు, 7.9 శాతం కూరగాయలు ఏపీలో పండుతాయి. పండిన పంట పొలాల్లోనే నిలిచిపోయింది. కూలీలు రాకపోవడంతో ఏం చెయ్యాలో రైతులకు దిక్కుతోచడం లేదు. ఆక్వా రంగ పరిస్థితీ ఇంతే.. తలలు తీసి నిల్వ చేసుకుందామంటే ఆక్వా కంపెనీల గిడ్డంగులు మూతపడ్డాయి. ఎకరా, అరెకరా లీజుకు తీసుకుని సాగు చేస్తున్న చిన్న, సన్న కారు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్ల అవసరాలనుబట్టి కాక కర్షకుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైతులు పండించిన పంటల మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి కర్షకులను యుద్ధ ప్రాతిపదికపై ఆదుకోవాలి.


-నీరుకొండ ప్రసాద్

Updated Date - 2020-04-11T06:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising