ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాడిదలు

ABN, First Publish Date - 2020-07-06T06:39:02+05:30

ఇది కల్పిత కథ కావొచ్చు నాకు ఆయన పేరు గుర్తు లేదు టిబెట్‌లో వుండే ఓ కవి జీవితాంతం అదే పనిగా కవితలు రాస్తూ రాస్తూ రాస్తూ కూర్చున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది కల్పిత కథ కావొచ్చు

నాకు ఆయన పేరు గుర్తు లేదు

టిబెట్‌లో వుండే ఓ కవి

జీవితాంతం అదే పనిగా

కవితలు రాస్తూ రాస్తూ రాస్తూ కూర్చున్నాడు

ఆయనకి ఎనభై తొమ్మిదేళ్లు వచ్చేసరికి

బట్టతల అద్దంలా మెరిసిపోతోంది

అప్పటికి ఆయన దగ్గర మూడు గాడిదల బరువున్న

కవితలు పోగుపడి వున్నాయి

ఆ కవితలన్నిటినీ ఆయన

ఓ బౌద్ధ ఆరామానికి ఇచ్చేద్దామనుకున్నాడు

వాటిని మూడు కిరాయి గాడిదల మీద వేసుకొని

వాటితో పాటే నడుస్తూ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు

అది ఎముకలు కొరుక్కుపోయే చలికాలం అవటంతో

ఆ ముసలాయన గజగజ వణికిపోతున్నాడు

దాంతో నడవలేకపోతున్నాడు

అప్పుడు ఒక గాడిద మీద వున్న కవితల్ని దించి 

మంట వేసుకుని చలికాచుకున్నాడు

ఇంక ప్రయాణం కొనసాగిద్దాం అని అనుకున్న సమయానికి

ఓ ఆలోచన ఆయన మనసులో మెదిలింది

అప్పుడు గాడిదల్ని చూశాడు

తను గాడిదలమీద రాసిన ఓ కవితని గుర్తుచేసుకున్నాడు

గాడిదలు కూడా పాపం వజవజ వణికిపోతున్నాయి

దాంతో మిగిలిన రెండు గాడిదల బరువున్న కవితలతో

మళ్లీ చలిమంట వేశాడు

దెబ్బమ్మటే వాటిని త్రిమూర్తుల్లా

ఆ చలిమంట చుట్టూ నిలబడేటట్టు చేశాడు

భవిష్యత్‌ తరాలకి ఆయన అందించిన 

ఒకే ఒక్క కవితా వాక్యం కాలకుండా మిగిలి వుంది

ఆయన కవిత్వ దృష్టి మొత్తం తెలుసుకోవటానికి

అది చాలు అని విమర్శకులు అన్నారు

నువ్వు ఎక్కి

ఊరేగే గాడిద కోసం

నువ్వే అన్వేషించాలి


Updated Date - 2020-07-06T06:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising