ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చెప్పినట్లు అనిపిస్తుంది

ABN, First Publish Date - 2020-08-17T06:03:11+05:30

క్షణ క్షణం అంతటా పూలు, వాక్యాల్లా పరుచుకోవాలన్న ఆశలోను నీ లోపలా, నా అంచులో గుచ్చుకుపోయే వాక్యాలు కొన్ని మిగిలిపోవాలనే దురాశలోను గది గదిలో ఎర్ర పూలను పాతినట్లు గుర్తు. వాటిని ముద్దాడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

When you lock the heart and

Unlock the life..

క్షణ క్షణం

అంతటా పూలు, వాక్యాల్లా పరుచుకోవాలన్న ఆశలోను

నీ లోపలా, నా అంచులో 

గుచ్చుకుపోయే వాక్యాలు కొన్ని మిగిలిపోవాలనే దురాశలోను 

గది గదిలో ఎర్ర పూలను పాతినట్లు గుర్తు.

వాటిని ముద్దాడిన

ఆ ఆఖరి దుఃఖ సమయం నాటి

ఏవో మాటలు, ఒక్క కవితగా పోగేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది

మనసు కలత విరబూసిన చెట్టుగా మారి చిట్టి పూలను మళ్ళీ కోరుతుంటుంది.

ఆత్మకు ఊపిరాడదు.

గుక్కపట్టినట్లు ఉక్కగా ఉన్నపుడు

ఆ పక్క కనిపించే ఆ చందమామా ఆ పూల గదికి తలుపూ కాదు.

అది ఒక బింబం

తెల్లటి తెల్లగా, నిస్సహాయంగానూ ఉంటుంది.

నేనిక్కడే అలానే ఉన్నానో ఉండిపోయానో కానీ

ఆదివారమో సోమవారమో రాత్రి

చెట్టు మీదుగా దిగులు కళ్ళు చందమామను పోల్చుకుంటాయి

చందమామ అతని లాంటిది.

ఒకరికి ఒకరం లాంటిది

నిరవధిక దీర్ఘకాలిక ఏకాంతంలో అన్ని భాషల రద్దు తరువాత

మబ్బులు నీలంగా, నిమ్మళంగా నక్షత్రాల కళ్ళతో పూస్తున్నాయనీ తెలుస్తుంది.

నక్షత్రం రాత్రి పుట్టి ఉదయమే మరణించడం ఏమిటని మౌనంగా 

    గాయపడుతున్నట్లుంది

ఇంతకీ చందమామ ఏదీ చూడదు మైనంలా గమ్మున ఉంటుంది.

కిటికీ పక్క చెట్టు, పసి మొక్కా ఏదైతేనేం గుబులూ గాయంతో ఊగుతుంటాయి

బిగి కౌగిలించకుండా వదిలేశావేమిటి జీవితమా అని అడుగుతుంటాయి.

తుమ్‌ న హుయే మేరే తో క్యా

మై తుమ్హారా మై తుమ్హారా రహా

అని చెబుతుంటాయి. 

లాలస


Updated Date - 2020-08-17T06:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising