ఏమిటీ చెలగాటం?
ABN, First Publish Date - 2020-11-13T05:35:08+05:30
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వరూపాన్ని మార్చేసిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడి భూములను దేశంలోని మిగతాప్రాంతాల వారికి...
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వరూపాన్ని మార్చేసిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడి భూములను దేశంలోని మిగతాప్రాంతాల వారికి అందుబాటులోకి తేవడం ద్వారా దాని అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది. బడాపారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఇక్కడి భూములు వశం చేసుకొనేందుకు వీలుగా కేంద్రం చట్ట సవరణలు చేసింది. ఆర్టికల్ 370 రద్దును గతంలో ఆకాశానికి ఎత్తేసిన జమ్మూవాసులకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలుగుతోంది.
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ భావితరాలకు తీరని నష్టం చేకూర్చుతుందని జమ్మూవాసులు, కశ్మీరీ పండిట్లు సైతం గ్రహిస్తున్నారు. అక్కడి సమస్త వ్యవస్థలను నాశనం చేసింది కాక, ప్రజాగ్రహాన్ని పెంచే ఈ తరహా నిర్ణయాలతో కేంద్రం ఆ సుందర ప్రాం తాన్ని ఏం చేయబోతున్నదో అర్థంకావడం లేదు. తుపాకీతో ఉగ్రవాదాన్ని నియంత్రించడం ఎల్లకాలమూ సాధ్యం కాదు. ప్రజలు ప్రభుత్వం పక్షాన ఉంటే ఉగ్రవాదానికి ఉనికే ఉండదు. మనసులు గెలవాలి కానీ, గుండెలు మండించకూడదు.
తిరుక్కోవిల్ ఆర్. గోవిందరాజన్
Updated Date - 2020-11-13T05:35:08+05:30 IST