ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు రైతులను పట్టించుకోరా?

ABN, First Publish Date - 2020-02-22T07:54:42+05:30

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన పసుపుబోర్డు పై ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి, నిజామాబాద్ ఎంపీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన పసుపుబోర్డు పై ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి, నిజామాబాద్ ఎంపీ ఇచ్చిన హామీతో పసుపు రైతులలో చిగురించిన ఆశలు ఇప్పుడు ఆడియాశాలైతున్నయి. ఇచ్చిన హామీని మరచి పసుపుబోర్డు కాకుండా అంతకుమించినది అంటూ స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రితో ప్రకటన ఇప్పించి రైతుల ఆశలపై నీళ్లుజల్లిన ఎంపీ పంట చేతికి వస్తున్న సమయంలో మద్దతు ధరపై ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం ఈ సమయానికి క్వింటాలు రూ. 6200 పలికిన పసుపు ధర, ఈ యేడు రూ. 4300కి పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి, నిజమాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పటికైనా దృష్టి సారించి తక్షణం పసుపుకి మద్దతు ధరపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇచ్చిన హామీ ప్రకారం పసుపుబోర్డు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రైతులు ఉద్యమాలు చేసైనా సాధించుకుంటారు.

వేముల కర్ణాకర్ రెడ్డి , జగిత్యాల

Updated Date - 2020-02-22T07:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising