ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితోద్యమ ఉపాసకుడు

ABN, First Publish Date - 2020-11-03T06:56:28+05:30

‘తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనంబు, తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనంబు, తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడు...’ అని వీరేశలింగం గురించి చిలకమర్తి చెప్పిన మాటలు మొన్న నవంబరు 1న విశాఖలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ అంబేద్కరిస్టు, బుద్ధిస్టు ఉపాసక కాశి కృష్ణకు అక్షరాలా వర్తిస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు చెందిన పల్లకుర్రు గ్రామంలో 1957 డిసెంబర్‌ 5న కృష్ణ జన్మించారు. తండ్రి సాధారణ పోలీసు కానిస్టేబులు. చదువుల కోసం యానాం వచ్చి స్థిరపడిన తర్వాత కృష్ణ డిగ్రీ వరకు అక్కడే చదివారు. అపుడే అంబేడ్కర్‌ భావజాలం పట్ల ఆకర్షితుడయి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. బొంబాయి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తూ అంబేడ్కర్‌ స్థాపించిన సిద్ధార్థ కాలేజీలో ఎం.కాం చదివారు. తాను నివసించే గోరేగావ్‌ వెస్ట్‌ ప్రాంతంలో ప్రేమనగర్‌, మోతీలాల్‌నగర్‌ ప్రాంతాల్లో తెలుగు దళితుల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు. మహారాష్ట్ర దళిత రచయితలతో, నాయకులతో సన్నిహితంగా మెలిగారు. స్వయంగా మరాఠీ భాషను నేర్చుకుని మహారాష్ట్ర దళిత ఉద్యమ స్వాతంత్య్ర చరిత్రను రాశారు. అది నీలిజెండా పత్రికలో అచ్చయి, ముద్రణకు సిద్ధంగా ఉంది. అంబేడ్కర్‌ ఆంధ్రదేశ పర్యటన గురించి తొలిసారిగా తెలుగులో వ్యాసం రాసి వార్త దినపత్రికలో ప్రచురించారు. ముంబైలో ఉద్యోగం పోయాక దుబాయిలో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో ఉద్యోగిగా చేరారు. అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ మిషన్‌ సొసైటీ, దుబాయిని స్థాపించి, జనరల్‌ సెక్రటరీ హోదాలో సంస్థ కార్యకలాపాలను పలు రాష్ట్రాలకు విస్తరించారు. అంబేడ్కర్‌ ఆంధ్రప్రాంతంలో పర్యటించిన మార్గాల గుండా, ఆయన అస్థికలతో ‘అంబేడ్కర్‌ చైతన్య రథయాత్ర’ను నిర్వహించారు. అంబేడ్కర్‌ సంపాదకత్వంలో వెలువడిన దళితపత్రిక ‘‘మూక్‌నాయక్‌’’ శతవార్షికోత్సవాలను గత ఏడాది విశాఖలో ఘనంగా నిర్వహించారు. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్‌ ఇండియా, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సమతా సైనిక్‌దళ్‌ సంస్థల్లో క్రియాశీలంగా పనిచేసి వాటి వ్యాప్తికి దోహదం చేశారు. దళిత ఉద్యమాల్లో ఫుల్‌టైమర్‌గా పని చేయడం కోసం అవివాహితుడిగానే ఉండిపోయారు. సామాన్య కార్యకర్తలా తెర వెనక ఉండడం కృష్ణ వ్యక్తిత్వంలోని నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం. ఉపాసక కాశికృష్ణ ఆకస్మిక నిష్క్రమణ దళిత ఉద్యమాలకు శరాఘాతం వంటిది.

డాక్టర్‌ శిఖామణి

కవిసంధ్య సంపాదకులు

Updated Date - 2020-11-03T06:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising