ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాలే గణపతి పూజామ్‌ కరిష్యామి

ABN, First Publish Date - 2020-08-22T05:52:21+05:30

‘ఒరే పెద్దోడా’. అది కైలాస మహాపర్వతంలో ఆది దంపతుల నిలయం. పార్వతమ్మ తన పెద్ద కొడుకు గణేశుని ఇలా ప్రేమగా పిలిచింది. ఆయన వెంటనే పలకలేదు. ‘గణేశా’ అని మళ్ళీ పిలిచింది ముద్దుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అమ్మా నేను ముందే చెపుతున్నా, ఈ సంవత్సరం నేను పందిళ్ళలో కూర్చోను. ఇళ్ళలో మాత్రమే పూజలు అందుకుంటాను’ అని బుంగమూతి పెట్టి అన్నాడు బుల్లిగణపతి. ‘‘అలాగే నాన్నా. ప్రతి ఇంట్లో ‘కరోనా కాలే గణపతి పూజాం స్వగృహే కరిష్యామి’ అని మంత్రం చెప్పుకోమని భూలోకంలో అందరికీ చెబుతాను, సరేనా’’ అని అన్నది పర్వత రాజనందిని అమ్మల గన్నయమ్మ మన మంగళగౌరమ్మ.


‘ఒరే పెద్దోడా’. అది కైలాస మహాపర్వతంలో ఆది దంపతుల నిలయం. పార్వతమ్మ తన పెద్ద కొడుకు గణేశుని ఇలా ప్రేమగా పిలిచింది. ఆయన వెంటనే పలకలేదు. ‘గణేశా’ అని మళ్ళీ పిలిచింది ముద్దుగా. ‘ఇంకా లేవలేదురా?’. ‘లేస్తున్నానమ్మా’ బద్ధకంగా సమాధానం చెప్పాడు గణేశుడు. ‘ఏమిటే అమ్మా’ దగ్గరికి వచ్చి అడిగాడు. ‘నీ పుట్టిన రోజు దగ్గరికి వచ్చింది కదా. ఇవాళ దశమి, ఎల్లుండి ద్వాదశి, మరి నువ్వు భారతావనికి పోయి అన్ని ఊళ్ళలో కూర్చోవాలి కదా తయారు కావా?’. ‘ఏమోనమ్మా ఈ సంవత్సరం నాకు పోవాలని లేదే’. కొడుకు మాట విని అమ్మ అంది ‘ఏంరా అలాగంటావు’. ‘‘ఏమీ లేదమ్మా నీకు తెలియనిదేముంది, భూలోకంలో ఇప్పుడు కరోనా వ్యాధి ప్రబలింది కదా. నేను పోయి అక్కడ మండపాలలో కూర్చున్నాననుకో, ఇక మైకులు పెడతారు. పాటలు వేస్తారు. ఉత్సవాలు చేస్తారు. జనం గుంపులు గుంపులుగా కూడతారు. దూరం పాటించరు. ఇలా నా పండగ పేరుతో మరికొంత మందికి ఈ వ్యాధి సోకితే ఏం బాగుంటుందమ్మా’. అన్నాడు వినాయకుడు అనాసక్తిగా. ‘ఆ వచ్చే భక్తులకు తెలియదటరా, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండానే వస్తారా? నీకు ప్రతి సంవత్సరం అంత భక్తితో వారు నీ పుట్టిన రోజు పండుగ జరుపుతారు కదా ఈ సంవత్సరం ఏదో కరోనా వచ్చిందని పోకపోతే బాధపడరూ’. అంది తల్లి బుజ్జగిస్తున్నట్లుగా. ‘నిజమేనమ్మా ప్రత్యేకించి తెలుగు వారికి, అందునా హైదరాబాదు వారికి నేనంటే చాలా ప్రేమ. ప్రతి సంవత్సరం నా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి పుట్టినరోజు చేస్తారు. నా భయం కూడా అదేనే. అలా చేస్తే జనాన్ని ఆపడం కష్టమే. ఈ వ్యాధి మరింత ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది. పాపం నా భక్తులు అలా జబ్బు పడి చనిపోవడం నాకు ఇష్టం లేదమ్మా’ అన్నాడు గణేశుడు. ‘సరే నాన్నా నీ మండపాలకు భక్తులు వచ్చినా ఏ జబ్బు రాకుండా వరం ఇవ్వమని మీ నాన్న గారిని కోరదాములే, అందువల్ల భయం లేకుండా వస్తారు’. అని అమ్మమాట. ‘అలా కాదే అమ్మా, నాన్నగారి గుడులకు కూడా జనం బాగా వస్తున్నారని గుడులు చాలా కాలం మూసేశారు. ఈ సంవత్సరానికి నేను పోకుండా ఉంటేనే బాగుంటది. అంతే కాదు అక్కడి ప్రభుత్వాలు కూడా సామూహిక ఉత్సవాలు నిషేధించాయి’.


‘ఇట్లా అయితే ఎట్లారా, నీ పుట్టిన రోజు ఏ అచ్చటా ముచ్చటా లేకుండా నువు ఇక్కడే ఇలా ఉండిపోవాలా? అదేం కుదరదు. నువు పోయి తీరాల్సిందే’. ‘సరే అమ్మా నేను భూలోకం... అదే మన భారత దేశానికి పోతాను. కానీ పందిళ్ళలో కూర్చోను. నన్ను భక్తితో పిలిచే ప్రతి ఇంటికీ పోతాను. వాళ్ళు చేసే పూజ అందుకుంటాను. ఉండ్రాళ్ళు తింటాను. వారు చెప్పే వ్రత కథ వింటాను. సరేనా. కానీ వారిని బహిరంగ ఉత్సవాలు చేయవద్దని ఈ సంవత్సరానికి సామూహిక నిమజ్జనాలు అవీ వద్దని నువ్వు కూడా వారికి చెప్పవే అమ్మా. నాన్నగారిని కూడా వారికి చెప్పమని చెప్పు’. ఇంతలో మూషిక రాజు అక్కడికి వచ్చి కిచకిచమంది. ‘ఏంటిరా నువ్వు కూడా పందిళ్లలో కూర్చొని అన్నీ తిందామని అనుకుంటున్నావా. అదేం కుదరదు ఈ సంవత్సరానికి ఇళ్ళవరకే ఉండాలి. అక్కడ ఏ ఇంట్లో ఏం పెడితే అది తిను. అక్కడ భూలోకంలో కూడా జనం అందరూ ఈ కరోనా భయంతో బయటి తిండి మానేశారు కేవలం ఇంట్లోనే తింటున్నారు. నీకూ నాకూ కూడా ఈ సంవత్సరం ఇంటి ప్రసాదమే బాగుంటుంది’. మళ్ళీ కిచకిచమని తోక ముడిచి వెనక్కు పోయింది ఏకదంతుని వాహనం.


‘అమ్మా ఇంకో మాట చెప్పాలే నీకు’. ముద్దులు కుడుస్తూ తొండాన్ని పైకెత్తి చెప్పాడు హస్తిముఖుడు అమ్మకు. ‘ఏం నాన్నా’ అంది పార్వతమ్మ. ‘ప్రతి సంవత్సరం నాకు రకరకాల విషపు రంగులు పూస్తున్నారు. తీసుకుపోయి మురికి చెఱువుల్లో వేస్తున్నారే నిమజ్జనం అని చెప్పి. ఒళ్ళంతా పాడైపోతుంది కద. అంతే కాదు మన చెఱువులు కూడా పాడవుతున్నాయమ్మా. కానీ ఈ సంవత్సరం ఎక్కవమంది నాకు ఇష్టమైన బంక మట్టితో చేస్తున్నారు. అది కూడా మన ఇంట్లో పట్టేలాగా చిన్నవి చేస్తున్నారు’. అన్నాడు గజముఖుడు. అమ్మ అందుకుంది ‘అవునురా పెద్దాడా, కొంత మంది భక్తులు మట్టితో చేయడమే కాదు. విత్తన గణపతి అని పేరు పెట్టి బొమ్మలో విత్తనం పెట్టి పూజ పండుగ అయిపోయిన తర్వాత అందులో నీళ్ళు పోస్తే మొక్క బయటికి వచ్చేలాగా చేస్తున్నారు’. ‘అవునమ్మా ఇది చాలా బాగుంటుంది. మన భక్తులకు ఇప్పుడిప్పుడే మంచి ఆలోచనలు వస్తున్నాయమ్మా’. మళ్ళీ అమ్మ చెప్పింది. ‘సరే నువు భూలోకానికి పోవడానికి సిద్ధంకా మరి’. ‘అమ్మా నేను ముందే చెపుతున్నా, ఈ సంవత్సరం నేను పందిళ్ళలో కూర్చోను. ఇళ్ళలో మాత్రమే పూజలు అందుకుంటాను’ అని బుంగమూతి పెట్టి అన్నాడు బుల్లిగణపతి. ‘‘అలాగే నాన్నా. అదుగో నందీశుని రంకె వినిపించింది. మీ నాన్నగారు కూడా వస్తున్నట్లున్నారు. నువు పోయి భూలోకం ప్రయాణానికి సిద్ధం కా. ప్రతి ఇంట్లో ‘కరోనా కాలే గణపతి పూజాం స్వగృహే కరిష్యామి’ అని మంత్రం చెప్పుకోమని భూలోకంలో అందరికీ చెబుతాను, సరేనా’’. అని అన్నది పర్వత రాజనందిని అమ్మల గన్నయమ్మ మన మంగళగౌరమ్మ. మన గణేశుడు భూలోకానికి పయనమయ్యాడు.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

Updated Date - 2020-08-22T05:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising