ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో గేమ్స్ వద్దు!

ABN, First Publish Date - 2020-11-21T05:46:48+05:30

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినట్టు కన్పిస్తున్నా, ముప్పు పొంచే ఉంది. ఈ నెలలో తగ్గుతూ వచ్చిన తీవ్రతను చూసి గండం గడిచింది అనుకుంటే పొరపాటే. కరోనా టీకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకూ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినట్టు కన్పిస్తున్నా, ముప్పు పొంచే ఉంది. ఈ నెలలో తగ్గుతూ వచ్చిన తీవ్రతను చూసి గండం గడిచింది అనుకుంటే పొరపాటే. కరోనా టీకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. తేలిగ్గా తీసుకుంటే ఎంత ప్రమాదమో ఢిల్లీ అనుభవం తెలియజేస్తోంది. గత నెల వరకూ అక్కడ కేసులు తగ్గుతూ వచ్చాయి. ప్రజల్లో కరోనా జాగ్రత్తల పట్ల కొంత ఉదాసీనత వచ్చింది. ఎప్పటిలాగానే ఈ చలికాలంలో అక్కడ వాయుకాలుష్యం బాగా పెరిగింది.


ప్రభుత్వం ఎంత చెప్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ప్రజలు లెక్క చెయ్యలేదు. మార్కెట్లు కిటకిటలాడాయి. మాస్కులు లేవు, భౌతికదూరం లేదు. ఫలితంగా నవంబరులో మళ్లీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజుకి వంద మరణాలు నమోదవుతూ, క్రమంగా సంఖ్య హెచ్చుతున్నది. పరిస్థితి ఇలా విషమించడంలో అందరి తప్పు ఉంది. ఎవరికి వారు బాధ్యత పడాల్సిన సమయమిది. ఢిల్లీని చూసి మన పాలకులు సైతం జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది. గుంపుల్ని, ప్రజా సమూహాల్ని, వేడుకల్ని ప్రోత్సహించే సమయం కాదు. మాస్కు వినియోగం,భౌతికదూరం, చేతుల శుభ్రత పాటించి తీరాల్సిందే. పొంచి ఉన్న కరోనాని మన ఉదాసీనత తో పెంచి పోషించరాదు. కరోనాపై యుద్ధంలో మనమంతా ఇంకా యుద్ధరంగం మధ్యలోనే ఉన్నాం. సరైన ఆయుధం కూడా లేదు. మన అప్రమత్తత, బాధ్యతాయుత ప్రవర్తనే మనకు రక్ష.


డి.వి.జి.శంకరరావు 

Updated Date - 2020-11-21T05:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising