ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ సిరులు సిరిసిల్లకేనా?

ABN, First Publish Date - 2020-10-15T06:01:00+05:30

నాలుగు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరల పేరిట 1033 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్ర ఐటి చేనేత జౌళి శాఖ మంత్రి కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాకే ఎక్కు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరల పేరిట 1033 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్ర ఐటి చేనేత జౌళి శాఖ మంత్రి  కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్‌లో అధికమొత్తాన్ని కేటాయిస్తు న్నారనే విమర్శలు వస్తున్నాయి. నేతకార్మికులు అధికంగా ఉన్న నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో కూడా చేనేత పార్కులు ఏర్పాటు చేసి వారికి పని కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణకే వన్నె తెస్తుందని చెపుకుంటున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది. ఈ పార్క్ తమ ప్రతిపాదనలో లేదని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వమే పూనుకుని దీని ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగవంతం చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి. తమకు చేతి నిండా పని కల్పించి వలసలు, ఆత్మహత్యలు లేకుండా చూడాలని నేతన్నలు ఎన్నాళ్లుగానో విజ్ఞప్తి చేస్తున్నారు. వారి మొర ఆలకించాలి.


– సామంతుల సదానందం, పరకాల

Updated Date - 2020-10-15T06:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising