ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు బాపూజీ ‘స్వీయచరిత్ర’

ABN, First Publish Date - 2020-10-02T05:57:57+05:30

కొన్ని సంవత్సరాల క్రితం మహాత్మాగాంధీ స్వీయచరిత్రను క్షుణ్ణంగా చదివాను. అది నా మనస్సులో చెరగని ముద్ర వేసింది. నా బాల్యదశలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని సంవత్సరాల క్రితం మహాత్మాగాంధీ స్వీయచరిత్రను క్షుణ్ణంగా చదివాను. అది నా మనస్సులో చెరగని ముద్ర వేసింది. నా బాల్యదశలోనే ఇలాంటి పుస్తకం చదివి ఉంటే నాకు ఎంతో మేలు జరిగి ఉండేదని అనిపించింది. మన విద్యార్ధులు ఇలాంటి పుస్తకాలు చదవకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరాలు చదువుతున్న విద్యార్ధులలో ఎంపిక చేసిన వారికి మహాత్మాగాంధీ స్వీయచరిత్ర 5000 కాపీలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాను. విశాఖపట్నం జిల్లా చోడవరం, దాని చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాల విద్యార్థులకు వాటిని పంపిణీ చేయదలిచాను. ఉపాధ్యాయుల బృందం మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహింస్తున్నాను. అయ్యప్ప 40 రోజులమండల దీక్ష మాదిరిగానే భక్తితో ప్రతి ఒక్కరు రోజుకు పది పేజీలను చదవాలన్నది నా ఆకాంక్ష. దీని వెనుక ఉన్న గొప్ప ఉద్దేశం ఏమిటంటే పాఠకులను నిజమైన సత్యాగ్రహులుగా మార్చడమే. ఈ పవిత్ర ఉద్యమాన్ని పరోపకారులందరూ మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు విశాఖజిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం జనవరి 30వ తేదీ (మహాత్మాగాంధీ వర్ధంతి)తో ముగుస్తుంది.

ప్రొఫెసర్ ముర్రు ముత్యాలు నాయుడు

మాజీ వైస్ ఛాన్సలర్, ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం

Updated Date - 2020-10-02T05:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising