ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతనొక్కడే చుక్కపొద్దు

ABN, First Publish Date - 2020-12-15T09:35:53+05:30

మానవ సమాజంలో ప్రతి కోణాన్ని లేదా ప్రకృతి పరంపరలో ప్రతి అంశాన్ని సృజించిన కలాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ సమాజంలో ప్రతి కోణాన్ని లేదా ప్రకృతి పరంపరలో ప్రతి అంశాన్ని సృజించిన కలాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే, అనుభవపూర్వకమైన సాహిత్యం తక్కువగా వెలువడిందనే చెప్పుకోవాలి. ఇలా వెలువడిన సాహిత్యంలో మనకు కన్పించే అరుదైన వ్యక్తి వరకుమార్‌ గుండెపంగు. ‘మైల’ ఆయన మొదటి నవల. అంటరానోళ్ళుగా ముద్రవేయబడిన సమూహాల గురించిన నవల ఇది. దైవం పేరిట, భక్తి పేరిట జరిగే మోసాలను, మూఢనమ్మక వ్యాప్తిని కుండ బద్దలుకొట్టినట్లుగా తెలుగు సాహిత్యంలో చిత్రీకరించిన ఏకైక నవల ‘మైల’. పోలీసు వ్యవస్థ డ్రిల్‌, డిసిప్లిన్‌, డ్రెస్‌ అనే ఈ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇదంతా కూడా ఎలా అమలవుతుందో సవివరంగా చెప్పిన నవల ‘నేను బానిసనా?’. కుల వ్యవస్థ అమరిక నిచ్చెన మెట్లను పోలిన మాదిరిగానే పోలీసు వ్యవస్థలో ర్యాంకింగ్ సిస్టం కూడా ఉందనీ, అదనంగా ఈ వ్యవస్థలో విదేశీ వర్గ నమూనాలు దాగున్నాయని, దీనికి ప్రధాన కారణం బ్రిటిషర్స్‌ అందించిన 1861 నాటి పోలీసు వ్యవస్థ నిర్మాణం కోసం రాయబడిన పోలీస్‌ మ్యాన్యువల్‌ అని వరకుమార్ నిర్మొహమాటంగా రాశాడు. 

ఈ దేశ జీవనచక్రం కులచట్రం పరిధిలోనే తిరుగుతున్నదన్న వాస్తవాన్ని వివరించిన నవల ‘ఊరవతల’. అశ్రితకులాల కలిసికట్టుగా బతకా లన్న ఆశాభావంతో రాసిన నవల ‘ఊరవతల’. ఆశ్రితకులాలన్నీ విడివిడిగా కులవృత్తుల ఆధారంగా బతికినంతకాలం అవి రాజ్యాధికారాన్ని పొందలేవని రచయిత స్పష్టం చేస్తాడు. ఆశ్రిత వృత్తుల గురించి ఎంతో ఆత్మాభిమానంతో ‘ఊరవతల’ నవలలో వరప్రసాద్ చిత్రీకరించారు. ఆశ్రితకులాల వారి మధ్య కులాంతర వివాహలు వికసించాలని, ఆ తర్వాతనే ఊరుపై పోటెత్తాలని, ఆశ్రిత వర్గాల వారు చదువులతో ఉన్నతాధికారులుగా ఎదగాలని రచయిత ఆకాంక్షిస్తాడు. 

తాను పని చేస్తున్న వ్యవస్థలో మార్పులు రావాలని, లోపాలను సవరించాలనే భావనతో పాటు తన సామాజిక నేపథ్యంపై వెలువడిన ఇతర పుస్తకాలపై సమగ్ర అధ్యయనంతో వివిధ పత్రికలలో రాసిన వ్యాసాల సంకలనమే ‘చుక్కపొద్దు’. అనతి కాలంలోనే ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఐదు పుస్తకాలను తెలుగు సమాజానికి అందించిన రచయిత వరకుమార్‌ గుండెపంగు. ముమ్మాటికీ చుక్కపొద్దు లాంటివాడే.

డాక్టర్ తిరుపతి పోతరవేణి 

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌

(నేడు వరకుమార్ గుండెపంగు పుస్తకాల ఆవిష్కరణ)

Updated Date - 2020-12-15T09:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising