ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్ష మూల్యాంకనంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-03-20T08:25:18+05:30

కరోన వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నపోతుండగానే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మూల్యాంకనం మరొక పెద్ద విషయం. ఈ పరిస్థితుల్లో మూల్యాంకన విధానంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోన వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నపోతుండగానే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మూల్యాంకనం మరొక పెద్ద విషయం. ఈ పరిస్థితుల్లో మూల్యాంకన విధానంలో కూడా మార్పులు చేస్తే బాగుంటుందని అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో కూడా మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోవిడ్ వైరస్సును కట్టుదిట్టంగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంటర్ బోర్డు షిఫ్టు పద్ధతిలో మూల్యాంకనాలను జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇది కొంతమేర మంచి నిర్ణయమే. కానీ ఒకే ప్రదేశంలో ఎక్కువమంది అధ్యాపక సిబ్బందితో మూల్యాంకనం జరపడం వల్ల అధ్యాపకులు దూర ప్రయాణాలు చేసి రావడం తప్పదు. ఈ ప్రయాణాల కారణంగా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. మరి కొద్దిరోజుల్లో పదవ తరగతి మూల్యాంకనం కూడా ప్రారంభం కాబోతున్న వేళ మూల్యాంకన కేంద్రాల వికేంద్రీకరణ దిశగా అడుగులు పడాలి. అదే విధంగా పరీక్షా పద్ధతిలోనూ మార్పులు చెయ్యాలి. కొంతమేర ఆబ్జెక్టివ్ పద్ధతిని అనుసరించి ప్రశ్నాపత్రం రూపొందించాలి. వీలైనంత తొందరగా వికేంద్రీకరణ చేసి, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియను జాగరూకతతో నిర్వర్తించాలి. సామూహిక క్రతువుకు స్వస్తి పలకాలి.

సుంకర రమేశ్, హైదరాబాద్

Updated Date - 2020-03-20T08:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising