ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలం కన్న కల

ABN, First Publish Date - 2020-10-05T07:28:45+05:30

ఆ రోడ్డు మీద నడుస్తుంటే దారంతా రాయక వదిలేసిన అక్షరాలే వీధి దీపపు కాంతిని ఆకుకో ముక్కని చేసే చెట్లలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ రోడ్డు మీద నడుస్తుంటే 

దారంతా రాయక వదిలేసిన అక్షరాలే 

వీధి దీపపు కాంతిని ఆకుకో ముక్కని చేసే చెట్లలో 

గొంగళి పురుగుల్లా మెలితిరుగుతూ 

రాత్రి గాలికి రాలిపడతాయి నా మీద 


అర్ధరాత్రి బండి మీద వెళ్లేప్పుడు 

కాలి వేళ్ళ మధ్య నాటకాలాడే చలిగాలి, 

ఆ పేరు తెలియని చెట్ల వాసన

పక్కనే పార్క్‌ చేసిన పాత సుమో

దశాబ్దాల వెనక ఒక సాధారణ రాత్రిని ఆవాహన చేసుకుని.. 

అదో క్షణకాలపు epiphany


రోడ్డు మీద బళ్లతో తొక్కబడ్డ తెల్ల పూలు 

రివర్స్‌ షాట్‌లో నేలమీంచి చెట్టెక్కి 

చూస్తాయి, పూస్తాయి 

రియలెస్టేట్‌ ఇంకా కబళించని స్థలమేదో 

ఎడమవైపు నిశ్శబ్ద కచేరి చేస్తుంటే

మంచు పడ్డట్టు, రాత్రి మెల్లగా కురుస్తుంది 


ఈ చెట్ల మీదా, దూరపు కొండల మీదా చెదిరిపోయింది 

నా కవిత్వమే అనుకున్నాను ఇప్పటివరకూ 

ఏరుకుని అతికిస్తే అది నేనే 

ఇప్పటి శరీరంలో అణువులు ఎప్పుడో ఒక నక్షత్రంలో మండినట్టు

ఈ అక్షరాలు నాకు ముందే పుట్టి, ఇక్కడ కాచుకున్నాయి 

ఎప్పుడో పుట్టాను నేను 

విశ్వం కళ్ళు తెరిచిన రోజుకి ఒక్కరోజు ముందే 


అందుకే కాబోలు 

కొత్తగా తెలిసే సంగతులన్నీ 

పాత భావాలకు సంతకాలే అనిపిస్తాయి 

ఇప్పుడు జరిగే నిజమంతా 

ఒకప్పుడు కాలం కన్న కల

స్వరూప్‌ తోటాడ

97007 73533


Updated Date - 2020-10-05T07:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising