ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త పైశాచికత్వం! కట్టుకున్న భార్యను కసితీరా.. మరో నలుగురితో కలసి..

ABN, First Publish Date - 2020-06-06T18:29:54+05:30

ట్టుకున్న భర్తే తనను కాటేశాడని, మరో నలుగురు వ్యక్తులతో కలసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తిరువనంతంపురానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కట్టుకున్న భర్తే తనను కాటేశాడని, మరో నలుగురు వ్యక్తులతో కలసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తిరువనంతంపురానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులకు ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలని ఆమె భర్త స్థానికంగా ఉన్న బీచ్‌కు తీసుకెళ్లాడు. తమ ఐదేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక భర్త ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తరువాత ఆమెను సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మరో నలుగురు వ్యక్తులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కుమారుడి ముందే భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. 


బాధితురాలు ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన సమయంలో ఐదుగురు కలసి ఆమెను కొట్టారు. కసితీరా సిగరెట్లతో గాయాలు చేశారు. అయితే.. ఏడుస్తున్న పిల్లాడిని ఇంట్లో దిగబెట్టి మళ్లివస్తానని బాధితురాలు వేడుకోవడంతో వారు ఆమెను విడిచిపెట్టారు. ఆ తరువాత రోడ్డుపైకి వచ్చిన ఆమె..అటుగా వెళుతున్న వాహనంలో లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి బయటపడ్డారు.


ఈ సందర్భంగా ఆమె కారులోని వ్యక్తులతో జరిగిన దారుణం గురించి చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ దారుణంలో భర్త కూడా పాలుపంచుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తిరువనంతపురం రూరల్ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుల్లో కొందరికి నేర చిరిత్ర కూడా ఉందన్నారు.  

Updated Date - 2020-06-06T18:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising