దొంగపైనే కారంకొట్టి తప్పించుకున్న మహిళ
ABN, First Publish Date - 2020-07-01T15:29:51+05:30
నెల్లూరు: తన కళ్లలో కారం కొట్టి బ్లేడుతో గాయపరిచేందుకు యత్నించిన ఓ దొంగ నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది.
నెల్లూరు: తన కళ్లలో కారం కొట్టి బ్లేడుతో గాయపరిచేందుకు యత్నించిన ఓ దొంగ నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చి మండలం శాంతినగర్‌లోని ఓ ఇంట్లో జరిగింది. సాయిరాం అనే వ్యక్తి దొంగతనానికి ఓ ఇంట్లో ప్రవేశించి.. మహిళ కళ్లలో కారం కొట్టి, బ్లేడుతో గాయపరిచేందుకు యత్నించాడు. సదరు మహిళ చాకచక్యంగా దొంగపైన అదే కారం కొట్టి తప్పించుకుని... పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై దొంగని పట్టుకున్నారు. అనంతరం దొంగని చెట్టుకి కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకి అప్పగించారు.
Updated Date - 2020-07-01T15:29:51+05:30 IST