ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య దగ్గర కోటి రూపాయలు కొట్టేసిన భర్త

ABN, First Publish Date - 2020-06-19T22:59:19+05:30

నగరంలోని గచ్చిబౌలిలో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. భార్యను ముప్పుతిప్పలు పెట్టిన ఓ భర్త.. ఆమె దగ్గర్నుంచే కోటి రూపాయలు కొట్టేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. భార్యను ముప్పుతిప్పలు పెట్టిన ఓ భర్త.. ఆమె దగ్గర్నుంచే కోటి రూపాయలు కొట్టేశాడు. సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన భార్య అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు తన స్నేహితుడి పేరుతో అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపేడు. ఆ తర్వాత వాటి ఆధారంగా ఆమెను, వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె నుంచి కోటి పైనే వసూలు చేశాడు. చివరకు భర్త సంతోష్‌పై అనుమానం వచ్చిన ఆమె సైబర్ క్రైమ్‌ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ మహిళా పోలీసులు, సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


నిందితుడిని రిమాండ్‌కు తరలించామని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు. గతంలో కూడా కొంతమంది మహిళలు పట్ల సంతోష్ అనుచితంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయని, చెడు వ్యసనాలకు బానిసై భార్యను సైతం వేధింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. సంతోష్‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-06-19T22:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising