ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి ప్రతిపాదన అడ్డుకున్నాడని యువకుడు ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2020-10-28T12:26:35+05:30

తన వివాహ ప్రతిపాదనను అడ్డుకున్నాడనే కోపంతో జేసీబీతో అతని దుకాణాన్ని కూల్చివేసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నూర్ (కేరళ): తన వివాహ ప్రతిపాదనను అడ్డుకున్నాడనే కోపంతో జేసీబీతో అతని దుకాణాన్ని కూల్చివేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా చెరువుళ ప్రాంతంలో వెలుగుచూసింది. అల్బిన్ అనే 30 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు చూస్తున్నాడు. తన పొరుగింటి వ్యక్తి అయిన ఓ దుకాణాదారు అల్బిన్ పెళ్లి సంబంధాలను అడ్డుకుంటున్నాడు.దీంతో ఆగ్రహించిన అల్బిన్ తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనలకు అడ్డుగా ఉన్న దుకాణాదారు షాపును జేసీబీతో ధ్వంసం కూల్చివేశాడు. దుకాణం కూల్చివేసే ముందు అందులో చట్టవిరుద్ధమైన జూదం, అక్రమ మద్యం వ్యాపారం సాగుతుందని వీడియోను చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 


అక్రమ కార్యకలాపాల గురించి తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోనందున తాను ఈ దుకాణాన్ని జేసీబీతో కూల్చివేశానని అల్బిన్ చెప్పాడు. పృథ్వీరాజ్, బిజూమీనన్ నటించిన ‘అయ్యప్పనమ్ కోషియం’ సినిమా సన్నివేశం చూసి ఈ చర్యకు పాల్పడ్డాడని దర్యాప్తులో తేలింది. తన పెళ్లి ప్రతిపాదనను అడ్డుకున్నాడని అల్బిన్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. జేసీబీతో దుకాణం కూల్చివేసిన అల్బిన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Updated Date - 2020-10-28T12:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising