ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురి హత్యకు తండ్రే కారణమన్న పోలీసులు! ఆమె బతికే ఉండటంతో షాక్!

ABN, First Publish Date - 2020-08-09T01:52:36+05:30

కుమార్తెను చంపినందుకు తండ్రి జైలు పాలయ్యాడు. ఆమె మాత్రం నిక్షేపంగా ఉంది. అదీ ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఓ బిడ్డను కూడా జన్మనిచ్చింది. ఆమె బతికే ఉన్న విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరెవరితోనే బలవంతంగా నేరం అగీకరించేలా చేసి..కేసు మూసేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కుమార్తెను చంపినందుకు తండ్రి జైలు పాలయ్యాడు. ఆమె మాత్రం నిక్షేపంగా ఉంది. అదీ ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఓ బిడ్డను కూడా జన్మనిచ్చింది. ఆమె బతికే ఉన్న విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల వైఫల్యం కారణంగా.. ఆ తండ్రి చేయని నేరానికి జైలు పాలయ్యాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది.


సదరు యువతి తప్పిపోయినట్టు ఆమె సోదరుడు రాహుల్ గతేడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఆమె హత్యకు గురైందని నిర్ధారించారు. ఆమె దుస్తులను, హత్య కోసం వాడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె తండ్రి, మరో సోదరుడే ఈ దారుణానికి పాల్పడ్డారని తేల్చేశారు. వారితో పాటూ మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరూ గత 18 నెలల నుంచీ జైల్లోనే మగ్గుతున్నారు.


ఇంతలో ఆ యువతి బతికే ఉన్నట్టు కుటుంబసభ్యులకు తెలిసింది. ఆమె తన ప్రియుడితో కలిసి పొరుగూరిలో నివసిస్తోందని, ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిందని తెలుసుకున్నారు. దీంతో వారు ప్రస్తుతం పోలీసులపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చేయని నేరాన్ని తమ వారిపై మోపి అన్యాయంగా జైలు పాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక పోలీసులు ఏం చేయాలో పాలు పోని స్థితిలో పడ్డారు. అమ్రోహా జిల్లాలోని అదమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


Updated Date - 2020-08-09T01:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising