ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయనిపై అత్యాచారం కేసులో యూపీ ఎమ్మెల్యేపై కేసు

ABN, First Publish Date - 2020-10-19T11:02:48+05:30

ఓ గాయనిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): ఓ గాయనిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఓ  ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. యూపీకి చెందిన నిషాద్ పార్టీ ఎమ్మెల్యే విజయ మిశ్రా, అతని కుమారుడు కలిసి 25 ఏళ్ల ఓ గాయనిపై సామూహిక అత్యాచారం చేశారని యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.2014వ సంవత్సరంలో ఎమ్మెల్యే మిశ్రా తనను ఓ కార్యక్రమం కోసం ఇంటికి పిలిచి, తనపై అత్యాచారం చేశాడని, సంఘటన గురించి చెపితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా 2015లో వారణాసిలోని ఒక హోటల్ లో గాయనిపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేశారని భడోహి జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ చెప్పారు.తనపై ఎమ్మెల్యే మిశ్రా అత్యాచారం చేసిన తర్వాత ఇంట్లో వదిలివేయాలని తన కొడుకు, మేనల్లుడికి చెప్పగా, వారిద్దరూ కూడా తీసుకెళ్లే ముందు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొన్నారు. 


ఎమ్మెల్యే మిశ్రా ఈ ఏడాది సెప్టెంబరులో భూమి కబ్జా కేసులో అరెస్టు అయి ఆగ్రా జైలులో ఉన్నారు. విజయ్ మిశ్రా వద్ద తన వీడియో క్లిప్ కూడా ఉందని, అతనిపై భయంతోనే గతంలో ఫిర్యాదు చేయలేదని బాధితురాలు చెప్పారు. ఎమ్మెల్యే మిశ్రాను మూడు వారాల క్రితం చిత్రకూట్ జైలు నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు. బీజేపీ మిత్రపక్షమైన నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ పార్టీకి చెందిన మిశ్రాపై పలు కేసులున్నాయి.

Updated Date - 2020-10-19T11:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising