ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కండోమ్‌కు చిల్లులు పెట్టినందుకు 4 ఏళ్ల జైలు శిక్ష!

ABN, First Publish Date - 2020-10-06T02:40:10+05:30

తన సహచరికి తెలీకుండా కండోమ్‌లకు చిల్లులు పెట్టినందుకు ఓ బ్రిటన్ వ్యక్తికి(47) అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: తన సహచరికి తెలీకుండా కండోమ్‌లకు చిల్లులు పెట్టినందుకు ఓ బ్రిటన్ వ్యక్తికి(47) అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితురాలు కొంత కాలంగా నిందితుడితో సన్నిహితంగా ఉంటోంది. అయితే..అతడికి దగ్గర కావాలంటే కచ్చితంగా కండోమ్ వాడాల్సిందేనని ఆమె కండిషన్ పెట్టింది. మొదట్లో ఇందుకు ఒప్పుకున్న నిందితుడు.. తరువాత ఆమెకు తెలీకుండా తను వాడే కండోమ్‌లకు చిల్లులు పెట్టేవాడు. ఓ రోజు బెడ్‌పై కండోమ్ ప్యాకెట్, సూది ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. ఆ తరువాత చెత్త బుట్టలోకి తొంగి చూస్తే తన అనుమానం నిజమైంది. విషయం కోర్టు వరకూ వెళ్లడంతో..నిందితుడు నేరం చేశాడని కోర్టు నిర్ధారించింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టు అతడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 

Updated Date - 2020-10-06T02:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising