ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు కుమార్తెలను హతమార్చి..

ABN, First Publish Date - 2020-11-03T15:49:33+05:30

ఇద్దరు కుమార్తె లను హతమార్చి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదానికి దారి తీసింది. కన్నియాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ వీవర్స్‌ కాలనీకి చెందిన రంజిత్‌ కుమార్‌ (31) మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రాశి (28), అక్షయ (5), అనుసూయ (3) అనే కుమార్తె ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ఇద్దరు కుమార్తె లను హతమార్చి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదానికి దారి తీసింది. కన్నియాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ వీవర్స్‌ కాలనీకి చెందిన రంజిత్‌ కుమార్‌ (31) మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రాశి (28), అక్షయ (5), అనుసూయ (3) అనే కుమార్తె లున్నారు. రంజిత్‌కుమార్‌ అనారోగ్యంతో గత ఏడాది మృతిచెందగా, రాశి తన ఇద్దరు కుమార్తెలతో జీవిస్తోంది. భర్త చనిపోయినప్పటి నుంచి ఆదరణ లేక రాశి మనస్తాపంతో వుండేది. ఈ నేపథ్యంలో రాశి తన ఇద్దరు కుమార్తెలకు నిద్ర మాత్రలు ఇచ్చి, తాను వేసుకుంది. అలాగే, ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమె పెట్టిన కేకలకు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొనేలోపు ఇద్దరు పిల్లలు మృతిచెందడం, రాశి మంటల్లో సజీవదహనం కావడం గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. సమాచారం అందుకున్న నేశమణినగర్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం ఆచారిపల్లం ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-11-03T15:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising