ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకినా.. ఆస్పత్రికి రానన్న కార్పొరేటర్!

ABN, First Publish Date - 2020-06-01T00:50:03+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా ప్రజలంతా భయపడిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా ప్రజలంతా భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కార్పొరేటర్‌.. తనకు కరోనా సోకిందని తెలిసినా ఆస్పత్రికి రానన్నాడు. ఈ ఘటన బెంగళూరులోని పాదరాయణపుర వార్డులో చోటుచేసుకుంది. ఈ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా సోకింది. దీంతో అతనికి చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లబోయిన అధికారులతో పాషా సహకరించలేదట. అంతేగాక ఆస్పత్రికి రావడానికి కూడా నిరాకరించాడట. ‘శనివారం మేం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చాలా సేపు వెయిట్ చేయించారు. ఆ తర్వాత అంబులెన్సులోకి ఎక్కేప్పుడు ఆయన అనుచరులు అంబులెన్సు చుట్టూచేరి నినాదాలు చేశారు’ అని అధికారులు చెప్పారు. దీంతో సామాజిక దూరం పాటించకపోవడం తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై పోలీసు కేసు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-06-01T00:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising