ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మందు పేరిట హోంగార్డుకు విషమిచ్చాడు...

ABN, First Publish Date - 2020-05-21T16:21:00+05:30

తన భార్యతో హోంగార్డు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి అతనికి కరోనా నివారణకు మందు అంటూ విషం ఇచ్చిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో...

న్యూఢిల్లీ : తన భార్యతో హోంగార్డు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి అతనికి కరోనా నివారణకు మందు అంటూ విషం ఇచ్చిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో 42 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో ఓ హోంగార్డుకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఎలాగైనా హోంగార్డుకు విషం తాగించి చంపాలని అలీపూర్ ప్రాంత వాసి వ్యూహం పన్నాడు. ఇద్దరు మహిళలను నియమించి వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నటించమని కోరాడు. అలీపూర్ ప్రాంత వాసి తాను నియమించుకున్న మహిళల ద్వార హోంగార్డుతోపాటు అతని ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా నివారణకు మందు అంటూ విషం తాగించారు. అనారోగ్యానికి గురైన నలుగురిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. హోంగార్డు కుటుంబానికి విషం ఇచ్చిన మహిళలను సీసీటీవీ ఫుటేజీ సాయంతో పట్టుకొని ప్రశ్నిస్తే అసలు సూత్రధారి అలీపూర్ ప్రాంత వాసి అని తేలింది. కేవలం తన భార్యతో  హోంగార్డుకు అక్రమసంబంధం ఉందనే అనుమానంతోనే అతన్ని చంపేందుకు యత్నించిన అలీపూర్ వాసితోపాటు ఇద్దరు మహిళలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఢిల్లీ  పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-05-21T16:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising