ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కరోనా పరీక్షలు చేయగా..

ABN, First Publish Date - 2020-04-08T19:05:02+05:30

తిరుపతిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా మంత్రపాళేనికి చెందిన మణికంఠ (26) ఎనిమిది నెలలుగా తిరుపతిలో ఉంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా మంత్రపాళేనికి చెందిన మణికంఠ (26) ఎనిమిది నెలలుగా తిరుపతిలో ఉంటున్నాడు. స్థానిక డిక్సన్‌ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచూస్తూ సుభాష్‌నగర్‌లోని ఎస్వీఎస్‌ వసతిగృహంలో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామానికి వెళ్ళలేక సహచరుడితో కలిసి మెన్‌ హాస్టల్‌లో ఉన్నాడు. సోమవారం రాత్రి గదిలో నిద్రపోయిన మణికంఠ.. ఉదయం లేచేసరికి గుమ్మంవద్ద పడి ఉండటాన్ని సహచరుడు గుర్తించి హాస్టల్‌ నిర్వాహకుడికి చెప్పారు. వారి సమాచారంతో ఎస్‌ఐ షేక్షావలి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడురోజులుగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నట్టు మణికంఠ రూమ్మేట్‌ ద్వారా తెలిసిందని ఎస్‌ఐ తెలిపారు. కరోనా నేపథ్యంలో కమిషనర్‌ గిరీషకు తెలియజేయడంతో మున్సిపల్‌, హెల్త్‌ ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని రుయాకు తరలించి శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగెటివ్‌ వచ్చిందని ఎస్‌ఐ వెల్లడించారు. అనారోగ్యంతో మృతిచెందినట్టు కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికను బట్టి దర్యాప్తు చేస్తామన్నారు. 

Updated Date - 2020-04-08T19:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising