ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకీతో భర్త ఆత్మహత్యాయత్నం! తలలోంచి బయటకొచ్చిన బుల్లెట్ పక్కనున్న భార్యకు తగిలి..

ABN, First Publish Date - 2020-05-24T16:57:53+05:30

కారులో భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వివాదం అనూహ్య పరిస్థితికి దారితీసింది. కోపంలో విచక్షణ కోల్పియన భర్త(34) తన చెవికి గన్ను గురిపెట్టి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే తలకు అవతలి వైపు నుంచి దూసుకొచ్చిన బుల్లెట్.. పక్క సీట్లో కూర్చున్న భార్యకు తగలడంతో ఆమె కూడా గాయాలపాలైంది. దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కారులో భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వివాదం అనూహ్య పరిస్థితికి దారితీసింది. కోపంలో విచక్షణ కోల్పియన భర్త(34) తన చెవికి గన్ను గురిపెట్టి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే తలకు అవతలి వైపు నుంచి దూసుకొచ్చిన తూటా.. పక్క సీట్లో కూర్చున్న భార్యకు తగలడంతో ఆమె కూడా గాయాలపాలైంది. దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అపస్మాకర స్థితిలో ఉన్న భర్త ప్రస్తుతం స్థానిక సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. భార్యకు ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. భార్య ఏడు నెలల గర్భణి అని సమాచారం. భర్తకు కొంత కాలంగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబంలో కలతలు రేగాయని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ చెకప్ కోసం దంపతులు ఆస్పత్రికి వెళుతుండగా వారి మధ్య వాగ్వివాదం చెలరేగింది. చెకప్ తరువాత భార్యను ఆమె తల్లిగారి ఇంట్లో దింపుతానని భర్త అంటే భార్య అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో వారి మధ్య జరిగిన వాదులాట తీవ్ర రూపం దాల్చడంతో కోపం కట్టలు తెచ్చుకున్న భర్త అకస్మాత్తుగా గన్నుతో తని తాను కాల్చుకున్నాడు. అతడి తల లోంచి బయటకొచ్చిన తూటా పక్క సీట్లో ఉన్న భార్యకు తగలడంతో ఆమెకు మెడ మీద గాయమైంది. అటుగా వెళుతున్న వ్యక్తి ఒకరు రక్తంలో తడిసిన దంపతులను చూసి వెంటనే పోలీసులకు సమాచారి అందించాడు. కాగా.. భర్తకు ఉద్యోగం లేకపోవడంపై తమ మధ్య గత నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్న భార్య పోలీసులకు తెలిపినట్టు సమాచారం. అత్యహత్యాయత్నానికి పాల్పడ్డందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటువంటి సందర్భాల్లో పక్కన కూర్చు వారు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇది బహు అరుదుగా జరిగే ఘటన అని వారు వ్యాఖ్యానించారు.  

Updated Date - 2020-05-24T16:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising