ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు ఆఫీసర్‌నంటూ మహిళపై అత్యాచారం

ABN, First Publish Date - 2020-12-23T13:27:14+05:30

తాను పోలీసు అధికారినంటూ చెప్పి హోటల్ లో ఓ మహిళపై అత్యాచారం జరిపిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తాను పోలీసు అధికారినంటూ చెప్పి హోటల్ లో ఓ మహిళపై అత్యాచారం జరిపిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందిన సందీప్ కుమార్ (28) అనే యువకుడు ఢిల్లీ పహర్ గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో తాను యూపీ పోలీసు అధికారినంటూ చెప్పి ఓ మహిళపై అత్యాచారం జరిపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అత్యాచార బాగోతంపై తాము నిందితుడు సందీప్ కుమార్ పై కేసు నమోదు చేశామని డీసీపీ సంజయ్ భాటియా చెప్పారు. నిందితుడు సందీప్ కుమార్ పోలీసు అధికారినంటూ నకిలీ గుర్తింపుకార్డుతో హోటల్ లో గదిని బుక్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 


పోలీసులు సీసీటీవీ ఫుటేజీలతోపాటు నిందితుడి కాల్ రికార్డులను పోలీసులు పరిశీలించారు. నిందితుడు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని బార్ లను సందర్శించాడని, ఇతను తరచూ మొబైల్ ఫోన్ నంబర్లు మారుస్తూ మహిళలతో సంప్రదింపులు జరిపాడని తేలిందని డీసీపీ చెప్పారు. తాను యూపీ పోలీసు అధికారినంటూ నటిస్తూ అమాయక మహిళలను ట్రాప్ చేశానని నిందితుడు వెల్లడించాడు. నిందితుడి అద్దె ఇంటి నుంచి యూపీ పోలీసు నేమ్ ప్లేటు, 3 మొబైల్ ఫోన్లు, రెండు నకిలీ గుర్తింపుకార్డులను స్వాధీనం చేసుకొని సందీప్ కుమార్ ను అరెస్టు చేశామని డీసీపీ చెప్పారు.

Updated Date - 2020-12-23T13:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising