ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిందనుకున్న భార్య ఏడేళ్ల తర్వాత కనిపించింది!

ABN, First Publish Date - 2020-03-04T19:23:10+05:30

భార్యను హత్య చేసి ఆమె శవాన్ని మాయం చశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు జైల్లో పెట్టారు. శవం దొరకకపోవడంతో అతడిని బెయిలుపై విడుదల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యను హత్య చేసి ఆమె శవాన్ని మాయం చశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు జైల్లో పెట్టారు. శవం దొరకకపోవడంతో అతడిని బెయిలుపై విడుదల చేశారు.  ఏడేళ్ల తరువాత అతని భార్య మరో ప్రదేశంలో కనపడింది. ఇదేదో సినిమా స్టోరీ కాదండోయ్ నిజజీవితంలో జరిగిన సంఘటన!!


ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో అభయ్ సుతర్ అనే వ్యక్తికి ఇతిశ్రీ అనే యువతితో ఫిబ్రవరి 2013లో వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకు అనుకోకుండా ఓ రోజు ఇతిశ్రీ కనబడకుండా పోయింది. ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో అభయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇతిశ్రీ తండ్రి మాత్రం తన కూతురిని అల్లుడే కట్నం కోసం వేధించి హత్య చేసి, శవాన్ని మాయం చేశాడని అభయ్‌పై కేసు పెట్టాడు. దీంతో పోలీసులు అభయ్‌ను అరెస్టు చేశారు. ఇతిశ్రీ శవం కనపడకపోవడంతో అభయ్‌ని బెయిలుపై విడుదల చేశారు. 


అప్పటినుంచి తన ఎంతో ప్రేమించిన భార్య కోసం అభయ్ వెతుకుతూనే ఉన్నాడు. ఏడేళ్ల తర్వాత అనుకోకుండా ఓ రోజు ఓడిశాలోని పూరి జిల్లా పిపిలీ ప్రాంతంలో ఇతిశ్రీ అభయ్ కంటపడింది. దీంతో అభయ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇతిశ్రీని అరెస్టు చేశారు. ఆమె రాజీవ్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అభయ్‌తో వివాహం కంటే ముందే రాజీవ్‌ను ప్రేమించానని కానీ తల్లిదండ్రలు ఒప్పుకోకపోవడంతో పెళ్లైన తరువాత రాజీవ్‌తో కలిసి కోల్‌కతా పారిపోయానని ఇతిశ్రీ చెప్పింది. 

Updated Date - 2020-03-04T19:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising