ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమ పిండితో జిల్లా జడ్జీ హత్య! స్నేహం కుదరట్లేదంటూ..

ABN, First Publish Date - 2020-07-30T16:43:45+05:30

ఓ మహిళతో న్యాయమూర్తికి ఉన్న స్నేహం ఆయన ప్రాణాల్నే బలితీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ఓ మహిళతో న్యాయమూర్తికి ఉన్న స్నేహం ఆయన ప్రాణాల్నే బలితీసుకుంది. జడ్జీని కలిసిందేందుకు న్యాయమూర్తి కుటుంబం అడ్డుపడుతోందని భావించిన ఆమె భారీ కుట్ర పన్నింది. ఈ క్రమంలో జడ్జీతో పాటూ ఆయన పెద్ద కుమారుడు కూడా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ హత్య మిస్టరీని పోలీసులు ఇటీవలే ఛేధించారు. నిందితురాలు సంధ్యా సింగ్‌తో పాటూ మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.


జిల్లా జడ్జి బేతుల్ మహేంద్ర త్రిపాఠి, ఆయను కూమారుడు విషపూరితమైన చపాతీలు తిని మృతి చెందినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై 20న నిందితురాలు..న్యాయమూర్తికి గోధుమ పిండిని ఇచ్చింది. పత్యేకంగా పూజ చేసి ఇది ఇస్తున్నానని, జడ్జీకున్న అన్ని సమస్యలూ తీరిపోతాయని చెప్పింది. దీంతో మహేంద్ర త్రిపాఠి..గోధుమ పిండిని ఇంటికి తీసుకెళ్లారు. ఆ పిండితో భార్య చపాతీలు చేయడంతో మహేంద్రతో పాటు ఆయన ఇద్దరు కూమారులు వాటిని తిన్నారు.  కాగా..ఆదే రోజున వారికి వాంతులు అవడం ప్రారంభించాయి.


ఆహారం కలుషితమై ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు.. జులై 23న ఆ ముగ్గురినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. జులై 25న మహేంద్ర సింగ్, ఆయన పెద్ద కుమారుడి ఆరోగ్య స్థితి క్షీణించడంలో డాక్టర్లు వారిని నాగ్‌పూర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. కానీ.. ఆస్పత్రికి చేరుకునేలోపే పెద్ద కుమారుడు మరణించగా.. న్యాయమూర్తి ఆదివారం నాడు మృతి చెందారు. అదృష్టవశాత్తూ ఆయన చిన్న కుమారుడి ఆరోగ్య స్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి.. మహేంద్ర భార్య అన్నంతోనే సరిపెట్టుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.


అయితే నాగ్‌పూర్‌కు వెళ్లే సమయంలోనే తండ్రి తనకు అసలు విషయం చెప్పారని, విషపూరిత చపాతీలు తినడం వల్లే పెద్ద కుమారుడు మృతి చెందాడని ఆయన చెప్పినట్టు చిన్న కుమారుడు పోలీసులకు తెలిపారు. తనకు పరిచయమున్న సంధ్య సింగ్ తనకు గోధుమ పిండి ఇచ్చిందని మహేంద్ర సింగ్ తనతో అన్నట్టు చిన్న కుమారుడు పోలీసులకు చెప్పారు.


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంధ్యా సింగ్‌ను అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన  సమాచారం ద్వారా కేసు మిస్టరీని ఛేదించారు. సంధ్యా సింగ్.. చింద్వారా జిల్లాలో ఓ ఎన్‌జీఓ నిర్వహిస్తోందని, మహేంద్ర సింగ్ అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

అయితే గత నాలుగు నెలలుగా మహేంద్ర కుటుంబం ఆయనతోనే కలిసి ఉంటుండటంతో సంధ్య ఆయన్ను కలవలేకపోయిందని వారు తెలిపారు. దీంతో వారందరిపై ఆమె కోపం పెంచుకుని ఈ భారీ కుట్రకు పాల్పడిందన్నారు. సంధ్యా సింగ్‌కు సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటనలో ప్రమేమయం ఉన్న ఓ తాంత్రికుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-30T16:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising