ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరెరె.. 10 ఏళ్ల బుడ్డోడు..30సెకెన్లు.. రూ.10 లక్షల చోరీ!

ABN, First Publish Date - 2020-07-16T22:56:09+05:30

ఓ బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించేందుకు సరిపోయే ఉదంతం ఒకటి మధ్యప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్:  ఓ బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించేందుకు సరిపోయే ఉదంతం ఒకటి మధ్యప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. 10 ఏళ్ల కుర్రాడు..30 సెకెన్లు.. 10 లక్షల రూపాయల బ్యాంకు రాబరీ.. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇదీ కథ. నీమచ్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన పోలీసులే నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.


ఓ పదేళ్ల కుర్రాడు..పట్ట పగలు..అందరి కళ్లూ కప్పి ఏకంగా 10 లక్షల రూపాయల బ్యాంకు సొమ్మును దోచేశాడు. క్యాషియర్ లేని సమయంలో మెల్లగా క్యాబిన్‌లో దూరి చకచకా డబ్బుల కట్టలను దొంగిలించి పరుగు పరుగున గేటు దాటేశాడు. ఆ సమయంలో కౌంటర్ వద్ద ఓ కస్టమర్ కూడా ఉన్నాడు. ఇతర వినియోగదారులతో బ్యాంకు అంతా హడావుడిగా ఉంది. అయినా కూడా బుడతడి చేతి వాటాన్ని ఒక్కరూ గమనించలేకపోయారు.


బుడ్డోడు భూమికి జానెడు ఎత్తే ఉండటంతో క్యాబిన్ బయటున్న కస్టమర్‌ లోపల ఏంజరుగుతోందో కనిపెట్టలేకపోయాడు. అయితే..పారిపోయే సమయంలో పిల్లోడి కంగారు చూసి సెక్యూరీటీకి అనుమానమొచ్చి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఉపయోగం లేకపోయంది. అప్పటికే మనోడు డబ్బుతో జంప్ అయిపోయాడు. 


విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. 20 ఏళ్లకు పైబడిన ఓ యువకుడు బ్యాంకులోనే అరగంట పాటు మకాం వేసి బుడ్డోడిని డైరెక్ట్ చేస్తూ వెనకుండి ఈ కథంతా నడిపించాడని పోలీసులకు అర్థమైంది. విచారణ సందర్భంగా ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.


స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ చోరీకి స్కెచ్ వేసిందని, పిల్లల సాయంతో క్షణాల్లో పని పూర్తి చేసిందని బయటపడింది. అంతేకాదు.. ఇలా పిల్ల దొంగల సాయంతో చోరీలకు పాల్పడటంలో ఆ ముఠా ఆరితేరిందని కూడా వారు తెలుసుకున్నారు.  పిల్ల దొంగల చేత ఇలాంటి రిస్కీ పనులు చేయించేందుకు ఆ ముఠాకు పెద్ద కారణమే ఉందట. ఒక వేళ ఈ బుడ్డోళ్లు పోలీసుల చేతికి చిక్కినా కూడా బాల నేరస్తులు కావడంతో చిన్ని చిన్న శిక్షలతోనే బయటపడతారని, పెద్ద తలయాల వివరాలు బయటపెట్టరనే ఉద్దేశ్యంతోనే ఆ ముఠా ఈ స్కీమ్‌ను అమలు చేస్తోందట.


ఇక చోరీకి ముందు ఈ ముఠా రెక్కీ కూడా నిర్వహించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి విచారణ కొనసాగుతోంది కాబట్టి ఈ కథ సశేషం అనుకోవాల్సిందే.. మరిన్ని వివరాల కోసం వెయిట్ చేయాల్సిందే.

Updated Date - 2020-07-16T22:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising