ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోజుల్లో ఐదుగురు అదృశ్యం

ABN, First Publish Date - 2020-10-10T18:09:34+05:30

నగరంలో మిస్సింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుగురు అదృశ్యమయ్యారు. వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో మిస్సింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుగురు అదృశ్యమయ్యారు. వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొంపల్లిలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైంది. భర్తతో గొడవపడిన భాగ్య అనే మహిళ పిల్లలు శ్రీచరణ్, ధన్‌కుమార్‌లతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల అంజూదేవీ ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. హయత్ నగర్ మండలం తట్టి అన్నారంలోని లారా అనే ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లేకుండా పోయింది. నిత్యం చాటింగ్ చేస్తుందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఏడు పోలీసు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.  

Updated Date - 2020-10-10T18:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising