ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసిడ్ దాడి కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు, అరెస్ట్

ABN, First Publish Date - 2020-10-14T21:41:34+05:30

ముగ్గురు దళిత మైనర్ బాలికలపై యాసిడ్ దాడి చేసిన నిందితుడిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోండా (ఉత్తరప్రదేశ్): ముగ్గురు దళిత మైనర్ బాలికలపై యాసిడ్ దాడి చేసిన నిందితుడిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బైక్ పై పారిపోతూ పిస్టల్ తో కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. నిందితుడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన నిందితుడిని అరెస్టు చేసి, ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. నిందితుడి నుంచి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యాసిడ్ దాడి ఎందుకు చేశాడనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ముగ్గురు సోదరిమణులపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.  


గోండా పట్టణానికి చెందిన 8,12,17 సంవత్సరాల వయసు గల ముగ్గురు దళిత సోదరీమణులు సోమవారం రాత్రి నిద్రపోతుండగా వారిపై ఓ వ్యక్తి ఒకరు యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు బాలికలకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మరో బాలిక ముఖంపై గాయమైంది. యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురు బాలికలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-10-14T21:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising