ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాయిదాల్లో చౌకగా సెల్ ఫోన్లు ఇస్తానంటూ మోసం

ABN, First Publish Date - 2020-09-17T13:55:50+05:30

ఖరీదైన సెల్ ఫోన్లను చౌకగా సులభ ఈఎంఐల ద్వారా ఇస్తానని ఆశ పెట్టి 2,500 మందిని మోసగించిన ఘరానా యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్ : ఖరీదైన సెల్ ఫోన్లను చౌకగా సులభ ఈఎంఐల ద్వారా ఇస్తానని ఆశ పెట్టి 2,500 మందిని మోసగించిన ఘరానా యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరంలోని ప్రతాప్ విహార్ ప్రాంతానికి ెందిన జితేందర్ సింగ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సులభవాయిదాల్లో చౌకగా సెల్ ఫోన్లు ఇస్తానని మొబిలిటీ వరల్డ్ వెబ్ సైట్ ద్వారా ప్రకటించాడు. ఇర్ఫాన్ పఠాన్ అనే యువకుడు సులభవాయిదాపై సెల్ ఫోన్ కొనేందుకు వర్చవల్ ప్రైవేటు అడ్రసు పే మొబైల్ కు 1499 రూపాయలను చెల్లించాడు. అలా ఇర్ఫాన్ 5,998 రూపాయలు చెల్లించినా సెల్ ఫోన్ మాత్రం రాలేదు. 


వెబ్ సైట్, ఫోన్ నంబర్లను తొలగించారు. జరిగిన మోసంపై ఇర్ఫాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘజియాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఈ ఘరానా మోసం బయటపడింది. జితేందర్ తన స్నేహితులు ప్రవీణ్ కుమార్, రజత్ శుక్లాలతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జితేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వ్యాపార భాగస్వాములు ప్రవీణ్ కుమార్, రజత్ శుక్లాలు పరారీలో ఉన్నారు. ఇలా వీరు 2,500 మందిని మోసగించి వారినుంచి డబ్బు గుంజారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

Updated Date - 2020-09-17T13:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising