ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లినిక్ కేంద్రంగా మహిళా డాక్టర్ అక్రమ రాకెట్

ABN, First Publish Date - 2020-03-04T15:56:15+05:30

ఓ మహిళా డాక్టర్ తన క్లినిక్ కేంద్రంగా వ్యభిచారిణులతో సాగిస్తున్న అక్రమ రాకెట్ బాగోతాన్ని పోలీసులు రట్టు చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా కానిస్టేబుల్‌ను పంపించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు 

భోపాల్ (మధ్యప్రదేశ్) : ఓ మహిళా డాక్టర్ తన క్లినిక్ కేంద్రంగా వ్యభిచారిణులతో సాగిస్తున్న అక్రమ రాకెట్ బాగోతాన్ని పోలీసులు రట్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలోని బర్ఖేడి ప్రాంతంలో వెలుగుచూసింది. బర్ఖేడీ ప్రాంతానికి చెందిన మహిళా డాక్టర్ గాయత్రి సింగ్ (52) కు యునానీ మెడిసిన్, సర్జరీలో డిగ్రీ చదివారు. ఈమె భోపాల్ నగరంలో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంలో క్లినిక్ తెరిచారు. మహిళా డాక్టర్ గత రెండేళ్లుగా క్లినిక్ మాటున వ్యభిచారిణులతో రాకెట్ నడుపుతున్నారు. ఈ రాకెట్ గురించి పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. బర్ఖేడ నివాసులు కొందరు క్లినిక్ మాటున వ్యభిచారం రాకెట్ నడుపుతున్నారని డీజీపీ వీకేసింగ్ కు సమాచారం అందించారు. దీంతో డీజీపీ ఈ సమాచారాన్ని భోపాల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు పంపించారు. ఈ క్లినిక్ పై నిఘా వేసిన పోలీసులు మారువేషంలో ఓ మహిళా కానిస్టేబుల్ ను పంపించారు. తనకు అత్యవసరంగా క్లినిక్ లో ఉద్యోగం కావాలని వచ్చిన మహిళా కానిస్టేబుల్ కు వ్యభిచారం చేయమని మహిళా డాక్టరు కోరింది. దీంతో మహిళా కానిస్టేబుల్ అందించిన సమాచారం మేర పోలీసు బృందం దాడి చేసి నలుగురు వ్యభిచారిణులు, ఆరుగురు విటులను అరెస్టు చేసింది. అరెస్టు చేశాక మహిళా డాక్టర్ ఫోన్ కు విటులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేయడంతో పోలీసులు విస్తుపోయారు. మహిళా డాక్టరును అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ ఆదితి భవసర్ చెప్పారు.

Updated Date - 2020-03-04T15:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising