ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ, బహుమతి పేరుతో యువతికి టోకరా

ABN, First Publish Date - 2020-05-28T14:59:39+05:30

యూకేలో డాక్టర్‌నంటూ పరిచయం చేసుకొని నగరానికి చెందిన మహిళ నుంచి రూ. 38 లక్షలు కొల్లగొట్టాడో సైబర్‌ నేరగాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : యూకేలో డాక్టర్‌నంటూ పరిచయం చేసుకొని నగరానికి చెందిన మహిళ నుంచి రూ. 38 లక్షలు కొల్లగొట్టాడో సైబర్‌ నేరగాడు. నగరానికి చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తనపేరు హెర్మన్‌ అని, యూకేలో డాక్టర్‌గా పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. అతడి మాటలు నమ్మిన మహిళ పరిచయం పెంచుకుంది. తరచుగా ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసుకునేవారు. కొంతకాలం క్రితం.. నీకు త్వరలో ఖరీదైన బహుమతిని పంపుతున్నానని మెసేజ్‌ చేశాడు.


కొన్ని రోజులకు ఆ బహుమతి పంపానని మెసేజ్‌ పంపాడు. తర్వాత మరో వ్యక్తి తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కస్టమ్‌ అధికారినంటూ ఆమెకు ఫోన్‌ చేశాడు. ‘మీకు వచ్చిన పార్సిల్‌లో డాలర్స్‌ ఉన్నాయి. వాటికి టాక్స్‌ చెల్లించాలి’ అని తెలిపాడు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్‌కంట్యాక్స్‌, కస్టమ్‌ డ్యూటీ, జీఎ్‌సటీ అంటూ వివిధ పేర్లతో పలు దఫాలుగా ఆమె నుంచి, ఆన్‌లైన్‌లో రూ. 38 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కూడా గిఫ్ట్‌ రాకపోవడంతో అతడికి ఆమె ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-05-28T14:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising