కరోనా పేషెంట్‌ను ఆస్పత్రికి తరలిస్తుంటే.. అధికారులపై దాడి?
ABN, First Publish Date - 2020-04-12T01:05:49+05:30
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కూడా విజృంభిస్తోంది. రోజురోజుకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోంది.
మీరట్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కూడా విజృంభిస్తోంది. రోజురోజుకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్ సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన బాధితుడి ఇంటికి చేరుకున్నారు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లబోయారు. అయితే దానికి అతను నిరాకరించాడు. దీంతో ఏం చేయాలో తోచని అధికారులు.. అతన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. ఇలా తీసుకెళ్తుండగా సదరు అధికారుల బృందంపై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ నగర మెజిస్ట్రేట్, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థి వెల్లడించారు. శనివారం జరిగిన ఈ దాడితో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2020-04-12T01:05:49+05:30 IST