ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70 ఏళ్ల దాకా బతకలేను అంటూ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య!

ABN, First Publish Date - 2020-08-16T04:44:20+05:30

నాకు 70 ఏళ్లు వచ్చే దాకా బతకడం ఇష్టం లేదంటూ ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నాకు 70 ఏళ్లు వచ్చే దాకా బతకడం ఇష్టం లేదంటూ ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని మోహిత్ సింఘ్లాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆయన పీడియాట్రిక్స్ శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. సింఘ్లా ఇంట్లోంచి దుర్వాసన వస్తోందంటూ ఇరుగుపొరుగు వారు పోలీసులకు శుక్రవారం నాడు సమాచారం అందించడంతో ఈ విషయం బయటపడింది. అతడు మృతి చెంది రెండు రోజులకు పైగానే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ‘ఇది నా జీవితం. నా నిర్ణయం. నాకు 60-70 ఏళ్లు వచ్చే వరకూ జీవించడం ఇష్టం లేదు’ అని డాక్టర్ తన సూసైడ్ నోట్‌లో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ‘నా మానసిక స్థితిని దాచుకోలేకపోయాను’ అని కూడా మోహిత్ రాశారని వారు తెలిపారు. అయితే ఈ ఘటనలో నేర కోణం లేదని తాము ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. కాగా.. ఇటీవల కాలంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో  ఎయిమ్స్ వైద్యులు కొందరు ఈ వారం మొదట్లో.. అక్కడి పనివాతావరణం యువవైద్యులను ఉత్సాపరిచేదిగా ఉండాలంటూ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

Updated Date - 2020-08-16T04:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising